Jabardasth Mohann : పెళ్లి చేసుకున్న జబర్దస్త్ లేడీ గెటప్ మోహన్..

జబర్దస్త్ కమెడియన్, లేడీ గెటప్ తో ఫేమస్ అయిన మోహన్ పెళ్లి చేసుకున్నాడు.

Jabardasth Mohann : పెళ్లి చేసుకున్న జబర్దస్త్ లేడీ గెటప్ మోహన్..

Jabardasth Comedian Lady Getup Famous Mohann Married with his Love

Updated On : April 2, 2024 / 7:26 AM IST

Jabardasth Mohann : తాజాగా జబర్దస్త్ కమెడియన్, లేడీ గెటప్ తో ఫేమస్ అయిన మోహన్ పెళ్లి చేసుకున్నాడు. గతంలోనే మోహన్ తన ప్రేమ విషయాన్ని ఓ టీవీ షోలో తెలిపాడు. థియేటర్ ఆర్టిస్ట్ అయిన మోహన్ క్యారెక్టర్స్ దొరక్కపోవడంతో లేడీ గెటప్ వేసుకున్నాడు. మోహన్ వేసిన లేడీ గెటప్, ఆ గెటప్ లో తాను మాట్లాడే స్లాంగ్ బాగా క్లిక్ అవ్వడంతో అదే కంటిన్యూ చేస్తూ ఫేమ్, డబ్బులు సంపాదించుకున్నాడు. జబర్దస్త్ తో బాగా పేరు తెచ్చుకున్నాడు మోహన్.

Also Read : Vijay Deverakonda : నాన్న కోసం విజయ్ దేవరకొండ ఏం చేసాడో తెలుసా? ఏకంగా సినిమాలో..

మోహన్ రెండు రోజుల క్రితమే వివాహం చేసుకున్నట్టు తెలుస్తుంది. తాను ప్రేమించిన అమ్మాయినే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితుల మధ్య గ్రాండ్ గానే చేసుకున్నారు. వీరి పెళ్ళికి జబర్దస్త్ ఫేమ్ రాకెట్ రాఘవ, అధిరే అభి, గడ్డం నవీన్‌, అప్పారావు.. మరింతమంది జబర్దస్త్ నటీనటులు వచ్చి ఆశీర్వదించారు. పలువురు వీరి పెళ్లి ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి. ఇక పలువురు నెటిజన్లు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.