Dhanaraj – Allu Arjun : బాలకృష్ణ కోసం పరుగు సినిమా వదిలేద్దాం అనుకున్నా.. కానీ అల్లు అర్జున్ వచ్చి చెప్పాక..

ధనరాజ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పరుగు సినిమా సమయంలో జరిగిన ఆసక్తికర విషయం తెలిపాడు.

Dhanaraj – Allu Arjun : బాలకృష్ణ కోసం పరుగు సినిమా వదిలేద్దాం అనుకున్నా.. కానీ అల్లు అర్జున్ వచ్చి చెప్పాక..

Jabardasth Fame Dhanaraj Revealed Interesting Things of Allu Arjun Parugu Movie

Updated On : February 17, 2025 / 3:50 PM IST

Dhanaraj – Allu Arjun : ధనరాజ్ జై సినిమాతో మొదలుపెట్టి ఆ తర్వాత కమెడియన్ గా చాలా సినిమాల్లో నటించి ఫేమస్ అయ్యాడు. జబర్దస్త్ తో మరింత పాపులర్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత నిర్మాత అయి డబ్బులు పోగొట్టుకోవడం, మళ్ళీ కామెడీ షోలకు వెళ్లడం జరిగింది. నటుడిగా ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తున్నా దర్శకుడిగా మారి ఇప్పుడు రామం రాఘవం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ధనరాజ్ నటిస్తూ డైరెక్ట్ చేసిన రామం రాఘవం సినిమా ఫిబ్రవరి 21న రిలీజ్ కాబోతుంది. తండ్రి కొడుకుల ఎమోషన్ తో తెరకెక్కిన ఈ సినిమాలో సముద్రఖని తండ్రి పాత్రలో నటించాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ధనరాజ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పరుగు సినిమా సమయంలో జరిగిన ఆసక్తికర విషయం తెలిపాడు.

Also Read : Vijay Deverakonda : ఫ్యామిలీతో విజయ్ దేవరకొండ కాశీ ట్రిప్.. అల్లు అర్జున్ భార్య కూడా వెళ్ళిందిగా.. ఆ డైరెక్టర్ కూడా.. ఫోటోలు వైరల్..

ధనరాజ్ మాట్లాడుతూ.. జగడం సినిమాతో నాకు మంచి పేరు వచ్చింది. ఇండస్ట్రీలో నాకు గుర్తింపు వచ్చింది. ఆ సినిమా తర్వాత వరుసగా ఆఫర్స్ వచ్చాయి. బాలకృష్ణ సినిమా ఒకటి, పరుగు, గొడవ, యువత.. ఇలా వరుస ఛాన్సులు వచ్చాయి. నాకే ఇన్ని అవకాశాల అని ఆశ్చర్యపోయాను కూడా. బాలయ్య గారిది పెద్ద సినిమా వదులుకోకూడదు అనుకున్నా. అయితే పరుగు సినిమా అప్పటికే లేట్ అవుతుంది అనిపించి పరుగు వదులుకుందామని వెళ్లి డైరెక్టర్ భాస్కర్ ని కలిసి సినిమా చేయను అని చెప్పాను. అప్పుడే అల్లు అర్జున్ మా దగ్గర్నుంచి వెళ్తూ నన్ను పిలిచాడు. అల్లు అర్జున్ పిలిచి జగడంలో బాగా చేసావు. బొమ్మరిల్లు డైరెక్టర్ ఈయన. ఆ సినిమా పెద్ద హిట్. తర్వాత ఈ సినిమానే చేస్తున్నాడు. ఈ సినిమా చెయ్యి నీకు పేరొస్తుంది అని చెప్పారు. ఇంక అల్లు అర్జున్ చెప్పిన తర్వాత సరే అని పరుగు సినిమా చేశాను అని తెలిపారు.

Also Read : Chiranjeevi – Venkatesh : 27 ఏళ్ళ క్రితమే చిరంజీవి – వెంకటేష్ భారీ మల్టీస్టారర్ ప్లాన్.. ఆ డైరెక్టర్ తో.. కానీ ఎందుకు అవ్వలేదు అంటే..?

పరుగు సినిమాలో ధనరాజ్ అల్లు అర్జున్ ఫ్రెండ్స్ లో ఒకడిగా కనిపిస్తాడు. అల్లు అర్జున్, శ్రీనివాస రెడ్డి, సప్తగిరి, ధనరాజ్ లను ఒక చోట బంధిస్తారని తెలిసిందే. అలా అల్లు అర్జున్ తో ధనరాజ్ కు ఈ సినిమాలో చాలా సీన్స్ ఉంటాయి.

Jabardasth Fame Dhanaraj Revealed Interesting Things of Allu Arjun Parugu Movie