Jabardasth : ఇకపై ఒకటే జబర్దస్త్.. మూడు టీమ్స్ వర్సెస్ మూడు టీమ్స్ పోటీ.. ఫైనల్ జబర్దస్త్ టీమ్స్ ఇవే..

తాజాగా జబర్దస్త్ కొత్త ప్యాట్రన్ ప్రకటిస్తూ ప్రోమో రిలీజ్ చేశారు.

Image Credits : Mallemala Youtube Channel Jabardasth Promo Thumb

Jabardasth : టీవీలో ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను నవ్విస్తున్న ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షోని ఇటీవల ఆపేసిన సంగతి తెలిసిందే. దాని బదులు జబర్దస్త్ నే రెండు ఎపిసోడ్స్ గా శుక్ర, శని వారాలు టెలికాస్ట్ చేస్తామని తెలిపారు. ఎక్స్‌ట్రా జబర్దస్త్ తీసేయడంతో చివరి ఎపిసోడ్ లో అందులో చేసే టీమ్స్ అన్ని బాధపడ్డాయి. తాజాగా జబర్దస్త్ కొత్త ప్యాట్రన్ ప్రకటిస్తూ ప్రోమో రిలీజ్ చేశారు.

Also Read : NTR : హమ్మయ్య.. ఎట్టకేలకు ఏపీ ఎన్నికల్లో కూటమి గెలుపు పై స్పందించిన ఎన్టీఆర్.. ఏమన్నాడంటే..

ఇప్పటివరకు చాలా టీమ్స్ ఉన్నా ఇప్పుడు అందర్నీ కలిపి ఆరు టీమ్స్ కింద చేశారు. మిగిలిన వాళ్ళు ఈ టీమ్స్ లోనే యాక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం జబర్దస్త్ లో రాకెట్ రాఘవ, బులెట్ భాస్కర్, ఆటో రామ్ ప్రసాద్, ఇమ్మాన్యుయేల్, పటాస్ ప్రవీణ్ – కెవ్వు కార్తీక్, తాగుబోతు రమేష్ – పటాస్ నూకరాజు.. ఇలా మొత్తం ఆరు టీమ్స్ చేశారు. అలాగే సరదా శుక్రవారం, సరిపోదా శనివారం.. అంటూ రెండు ఎపిసోడ్స్ గా విడగొట్టారు.

ఒక రోజు మూడు టీమ్స్, ఇంకో రోజు మూడు టీమ్స్ పర్ఫార్మ్ చేయగా ఒక్కో టీమ్ కి 20 పాయింట్స్ కి వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ ని బట్టి మార్కులు ఇస్తారు. ఇలా రెండు రోజులు మూడు టీమ్స్ కి 60 చొప్పున మార్కులు వేస్తారు. ఇందులో ఏ మూడు టీమ్స్ కి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళు గెలిచినట్టు. అయితే గెలిచిన వాళ్లకు ప్రైజ్ మనీ కంటెస్టెంట్స్ అంతా ముందే బెట్టింగ్ వేసుకొని అమౌంట్ అనుకుంటే ఆ అమౌంట్ ని ఇస్తారు. ఇక విన్నర్స్ ఎవరు అనేది శనివారం జడ్జీలు ప్రకటిస్తారు. ప్రస్తుతం జబర్దస్త్ జడ్జిలుగా కృష్ణ భగవాన్, కుష్బూ వ్యవహరిస్తున్నారు.

జబర్దస్త్ కొత్త ప్యాట్రన్ ప్రోమో మీరు కూడా చూసేయండి..