Jabardasth Nukaraju
Jabardasth Nukaraju : సంక్రాంతి అంటే తెలుగువారికి పెద్ద పండగ. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో కుటుంబాలతో కలిసి గ్రాండ్ గా జరుపుకుంటారు. ఎక్కడెక్కడో ఉన్న తెలుగువాళ్లంతా వారి ఇంటికి వచ్చి సంతోషంగా గడుపుతారు. సంక్రాంతికి కోడిపందాలు లాంటివి ఆనవాయితీగా ప్రతి ఊళ్లోనూ జరుగుతుంటాయి. గోదావరి జిల్లాల్లో అయితే కోడి పందాలు భారీ ఎత్తున జరుగుతాయని తెలిసిందే.(Jabardasth Nukaraju)
జబర్దస్త్ నూకరాజు లేటెస్ట్ జబర్దస్త్ ఎపిసోడ్ లో సంక్రాంతి గురించ్చి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తాజాగా సంక్రాంతి స్పెషల్ జబర్దస్త్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసారు.
Also See : Actress Laya Gorty : పండగ పూట బొమ్మల కొలువు పెట్టిన ఒకప్పటి హీరోయిన్ లయ.. ఫొటోలు..
ఈ ప్రోమోలో జబర్దస్త్ నూకరాజు స్కిట్ లో.. ఓ వ్యక్తి సంక్రాంతి అంటే ఏంటండి అని అడిగితే నూకరాజు పక్క రాష్ట్రాల నుంచి భీమవరం నరసాపురం వెళ్లి ఎక్కువ ఎక్కువ డబ్బులు తెచ్చుకొని అవి గుండాట, కోడి పందాలలో పోగొట్టేసి వెళ్ళేటప్పుడు చార్జీకి అప్పులు చేసుకొని వస్తారు చూడు దాన్నే సంక్రాంతి అంటారు అని అన్నాడు. చివర్లో మేము సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ వెళ్ళడానికి డబ్బులు లేవు చార్జికి అప్పు ఇవ్వండి అని నూకరాజుని అడుక్కున్నట్టు చూపించారు.
దీంతో నూకరాజు కామెంట్స్ వైరల్ గా మారాయి. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పండగని ఇలా విమర్శిస్తున్నారు అని కొంతమంది కామెంట్స్ చేస్తే మరికొంతమని నిజం చెప్పాడు అని అంటున్నారు. మొత్తానికి జబర్దస్త్ సంక్రాంతి ఎపిసోడ్ నూకరాజు స్కిట్ వల్ల బాగా వైరల్ అయ్యేలా ఉంది. ప్రోమోలోనే ఇలాంటి డైలాగ్స్ ఉన్నాయంటే ఫుల్ ఎపిసోడ్ లో నూకరాజు స్కిట్ లో సంక్రాంతి మీద ఇంకెన్ని కామెంట్స్ చేసాడో అని ఎదురుచూస్తున్నారు.
Also Read : Allu Arjun : ఈ లెక్కన త్రివిక్రమ్ సినిమాని పక్కన పెట్టేసిన అల్లు అర్జున్.. అట్లీ తర్వాత లోకేష్ తోనే..
మీరు కూడా జబర్దస్త్ సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ ప్రోమో చూసేయండి..