Allu Arjun : ఈ లెక్కన త్రివిక్రమ్ సినిమాని పక్కన పెట్టేసిన అల్లు అర్జున్.. అట్లీ తర్వాత లోకేష్ తోనే..
భోగి నాడు అల్లు అర్జున్ కొత్త సినిమా తమిళ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో ప్రకటించాడు.
Allu Arjun
- అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా అనౌన్స్
- త్రివిక్రమ్ సినిమా ఉందా లేదా
- అట్లీ తర్వాత లోకేష్ తోనే
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప సినిమాలతో పాన్ ఇండియా స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. దీంతో తన నెక్స్ట్ సినిమాలు అన్ని భారీగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం తమిళ్ డైరెక్టర్ అట్లీతో భారీ సైఫై సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది.(Allu Arjun)
తాజాగా నిన్న భోగి నాడు అల్లు అర్జున్ కొత్త సినిమా తమిళ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో ప్రకటించాడు. ఈ సినిమాని ప్రకటిస్తూ చిన్న గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో పవర్ ఫుల్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.
Also Read : Sravanthi Chokarapu : పండగ పూట కొడుకుతో ఫోటోలు షేర్ చేసిన యాంకర్ స్రవంతి..
అయితే అల్లు అర్జున్ తనకు మూడు సూపర్ హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ తో గతంలో సినిమా ప్రకటించారు. పుష్పతో పాన్ ఇండియా స్టార్ డమ్ రావడంతో త్రివిక్రమ్ సినిమా కూడా పాన్ ఇండియా ప్లాన్ చేసారు. సుబ్రహ్మణ్య స్వామి కథతో ఈ సినిమా ఉంటుందని నిర్మాత నాగవంశీ కూడా చెప్పారు. దీంతో ఆ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
అయితే బన్నీ – లోకేష్ సినిమా ప్రకటనలో 2026 నుంచే షూటింగ్ మొదలవుతుందని, AA23 సినిమా అదే అని అనౌన్స్ చేసారు. మరి అట్లీ సినిమా తర్వాత లోకేష్ సినిమా చేస్తే త్రివిక్రమ్ సినిమాని పక్కన పెట్టేసినట్టేనా? అసలు త్రివిక్రమ్ – బన్నీ సినిమా ఉందా లేదా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
