×
Ad

Jabardasth Rajamouli : కరోనాతో చనిపోయేవాడ్ని.. అలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు.. రాజమౌళి ఎమోషనల్

కరోనా సమయంలో తను ఎదుర్కున్న ఇబ్బందులు తెలిపాడు రాజమౌళి. (Jabardasth Rajamouli)

Jabardasth Rajamouli

Jabardasth Rajamouli : ఎన్నో ఏళ్లుగా సినీ, టీవీ పరిశ్రమలో ఉన్న రాజమౌళి జబర్దస్త్ షోలో మందు తాగిన వ్యక్తిగా నటించి పాపులారిటీ తెచ్చుకున్నాడు. మందుపై పేరడీ సాంగ్స్ పాడి, జబర్దస్త్ స్కిట్స్ తో ఫేమస్ అయ్యాడు. తాజాగా జబర్దస్త్ రాజమౌళి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.(Jabardasth Rajamouli)

ఈ క్రమంలో కరోనా సమయంలో తను ఎదుర్కున్న ఇబ్బందులు తెలిపాడు రాజమౌళి.

Also Read : Naveen Polishetty : వామ్మో నవీన్ పోలిశెట్టి రెమ్యునరేషన్ అంత పెంచేసాడా..? నాలుగు సినిమాలు హిట్ కొట్టగానే..

జబర్దస్త్ రాజమౌళి మాట్లాడుతూ.. నాకు కరోనా వచ్చినప్పుడు చనిపోతాను అనుకున్నాను. అంత సీరియస్ అయింది. అభి అన్న, కొంతమంది జబర్దస్త్ వాళ్ళు సపోర్ట్ చేసారు. మ్యూజిక్ డైరెక్టర్ భోలే, వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీకి సపోర్ట్ చేసింది. నాకు అప్పుడు షుగర్ బాగా పెరిగింది. ఏది పడితే అది తినకూడదు. అందుకే నా కోసం సపరేట్ గా భోలే వాళ్ళ అమ్మ, భార్య వండుకొని తీసుకొచ్చేవాళ్ళు హాస్పిటల్ కి.

నేను అయితే చనిపోతా అనుకున్నా. నా వల్ల మా అమ్మ, భార్య, పిల్లలకు, అన్న వాళ్లకు కూడా కరోనా వచ్చింది. నా భార్య ఎక్కడ చనిపోతుందో, నా పిల్లలు ఎక్కడ చనిపోతారో అని బాధపడ్డాను. మేము ఎవరు చనిపోతామో మాకే తెలియదు. అలా ఉండేది పరిస్థితి. ఆ సమయంలో చాలా భయపడ్డాను. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు అంటూ ఎమోషనల్ అయ్యాడు.

Also Read : Jabardasth Rajamouli : నన్ను టీమ్ లీడర్ అవకుండా చేసింది వాళ్లిద్దరే.. జబర్దస్త్ రాజమౌళి సంచలన వ్యాఖ్యలు..