Jabardasth Satya Sri : విక్రమ్-1 రాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ లేడీ కమెడియన్ చెల్లి.. సత్యశ్రీ పోస్ట్ వైరల్..
ఈ ప్రయోగంలో జబర్దస్త్ లేడీ కమెడియన్ సత్యశ్రీ సొంత చెల్లి కీర్తి శ్రీ కూడా ఒక భాగమైంది.(Jabardasth Satya Sri)
- Saketh U
- Published on- July 19, 2026 / 05:57 PM IST
Jabardasth Satya Sri
Jabardasth Satya Sri : ప్రముఖ స్పేస్ టెక్ స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మిషన్ ఆగమన్ పేరుతో రూపొందించిన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగం నిన్న శనివారం నాడు చేపట్టింది. ఈ రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రంలో ఈ ప్రయోగం జరిగింది. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా అభినందనలు వచ్చాయి. శాస్త్రవేత్తలతో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఫోన్లో మాట్లాడారు.
అయితే ఈ ప్రయోగంలో జబర్దస్త్ లేడీ కమెడియన్ సత్యశ్రీ సొంత చెల్లి కీర్తి శ్రీ కూడా ఒక భాగమైంది. తాజాగా సత్యశ్రీ తన చెల్లి కీర్తి శ్రీ ఏరోస్పేస్ సెంటర్ లో, ఆ ప్రయోగానికి సంబంధించిన వర్క్ చేస్తున్నప్పుడు దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి తన చెల్లిని చూసి గర్వపడుతున్నాను అని చెప్తూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.
Also Read : Vidyullekha Raman : బిగ్ బాస్ పై లేడీ కమెడియన్ సంచలన వ్యాఖ్యలు.. 24 గంటల్లో జరిగేది..
కీర్తి శ్రీ ఫొటోలు షేర్ చేసి.. కౌంట్‌డౌన్‌కు ముందు, లెక్కలేనన్ని గంటలపాటు పరీక్షలు జరిగాయి. ప్రారంభోత్సవానికి ముందు అమితమైన అంకితభావం కనబడింది. స్కైరూట్ ఏరోస్పేస్ బృందానికి, విక్రమ్-1 సిబ్బంది అందరికీ, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, శాస్త్రవేత్తలు, తెర వెనుక ఉన్న ప్రతి ఒక్కరికీ. మీ అభిరుచి, ఆవిష్కరణ మరియు సమష్టి కృషి కలలను నిజం చేశాయి. దీనిని సాధ్యం చేసిన ఇంజనీర్లలో నా చిన్నారి యువరాణి, నా సోదరి కీర్తి శ్రీ కూడా ఉన్నారు. ఆమె విక్రమ్-1 కోసం ఏవియానిక్స్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంటిగ్రేషన్ & టెస్ట్ ఇంజనీర్‌గా పనిచేశారు. ఆమె తనిఖీ చేసిన ప్రతి తీగ, పరీక్షించిన ప్రతి వ్యవస్థ, అధిగమించిన ప్రతి సవాలు మిషన్ ఆగమనంను ఆకాశానికి మరింత చేరువ చేశాయి.
చిన్నప్పుడు నక్షత్రాలను కుతూహలంతో చూసిన ఆ చిన్నారి నుండి ఇప్పుడు వాటి వైపు ప్రయాణాన్ని నిర్మించడంలో సహాయపడే ఇంజనీర్‌గా మారిన ఈ క్షణం ఎన్నో సంవత్సరాల కలలు, కఠోర శ్రమ, జ్ఞాపకాలను మోస్తుంది. ఈ రోజు నేను కేవలం ఒక రాకెట్‌ను చూడటం లేదు. నేను ఆమె అంకితభావాన్ని, ఆమె కలలను, ఆమె ప్రయాణం గాల్లోకి ఎగరడాన్ని చూస్తున్నాను. కీర్తిశ్రీ నిన్ను చూసి గర్వంగా ఉంది. మిషన్ ఆగమన్‌ను ఒక చారిత్రాత్మక ఘట్టం. నా సోదరి విక్రమ్-1 ‘ఆగమన్’ రాకెట్‌పై తన పేరును సంతకం చేస్తుంటే నా హృదయం గర్వంతో నిండిపోయింది. ఈ అద్భుతమైన ఘనతకు అభినందనలు. ఇది మరెన్నో మైలురాళ్లకు నాంది కావాలని ఆశిస్తున్నాను అంటూ పోస్ట్ చేసింది సత్యశ్రీ. దీంతో సత్యశ్రీ పోస్ట్ వైరల్ గా మారింది.
లేడీ కమెడియన్ గా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు సినిమాల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతుంది సత్యశ్రీ. ఆమె చెల్లి కీర్తిశ్రీ ఇలా స్పేస్ ఇంజనీర్ గా ఉండటం విశేషం. వీరి తల్లి కూడా ఒకప్పుడు నటి కావడం విశేషం. ఇలా ఇద్దరు అక్కాచెల్లెళ్లు వారి వారి రంగాల్లో దూసుకుపోవడంతో వీరిని అంతా అభినందిస్తున్నారు.
