Vidyullekha Raman : బిగ్ బాస్ పై లేడీ కమెడియన్ సంచలన వ్యాఖ్యలు.. 24 గంటల్లో జరిగేది..
విద్యుల్లేఖ రామన్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. (Vidyullekha Raman)
Vidyullekha Raman
Vidyullekha Raman : బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. సెలబ్రిటీలతో పాటు మాములు వ్యక్తులు కూడా వెళ్తూ అందులోకి వెళ్ళడానికి ఎదురుచూస్తుంటారు. కానీ కొంతమంది మాత్రం అమ్మో బిగ్ బాస్ వద్దు అని అంటారు. అలా తాజాగా లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్ బిగ్ బాస్ లోకి వెళ్ళను అంటూ ఆ షోపై ఆసక్తికర ఆవ్యాఖ్యలు చేసింది.
Also Read : Nagababu Niharika : అప్పుడు నాగబాబు ఇప్పుడు నిహారిక.. సరికొత్త రికార్డ్ సృష్టించిన తండ్రీకూతుళ్ళు..
విద్యుల్లేఖ రామన్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను నాన్ కాంట్రవర్సీ రియాల్టీ షోలు మాత్రమే చేస్తాను. ఆల్రెడీ మూడు నాలుగు షోలు చేశాను. కానీ బిగ్ బాస్ లో చేయడం ఇష్టం ఉండదు. నాలుగైదు ఏళ్లుగా బిగ్ బాస్ కి పిలుస్తున్నారు. తమిళ్, తెలుగులో రెండు చోట్ల పిలుస్తున్నారు. కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు.
ఎందుకంటే 24 గంటల్లో జరుగుతూ ఉన్న విషయాల్ని మీరు ఒక గంటలో ఎలా చూపిస్తారు. చాలా ఎడిటింగ్ ఉంటుంది. వాళ్లకు నచ్చినట్టు మన మాటల్ని కట్ చేసి చూపిస్తారు. అది జనాలు నమ్మి ట్రోలింగ్ చేస్తారు. అది నాకు అవసరం లేదు. గుడ్ వైబ్స్ చాలు. కాంట్రవర్సీ లోకి వెళ్లడానికి ఇంట్రెస్ట్ లేదు. అవి ఫేస్ చేయడానికి అంత మెంటల్ స్ట్రెంగ్త్ నా దగ్గర లేదు. నేను మాట్లాడింది ఏదైనా తప్పుగా అర్ధం చేసుకొని అది నెగిటివ్ అయితే నేను హ్యాండిల్ చేయలేను. అది చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు గ్రేట్ అని తెలిపింది. దీంతో విద్యుల్లేఖ రామన్ కి బిగ్ బాస్ ఆఫర్ వచ్చినా చేయను అని చెప్పేసినట్టు క్లారిటీ ఇచ్చేసింది.
