Yamudu Movie Song Released
Yamudu Song : జగన్నాధ పిక్చర్స్ బ్యానర్ పై జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా ‘యముడు’. ధర్మో రక్షతి రక్షితః అనేది ఉప శీర్షిక. శ్రావణి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. మైథలాజికల్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జానర్ లో ఈ యముడు సినిమా తెరకెక్కుతుంది.
ఇప్పటికే యముడు సినిమా నుంచి పోస్టర్స్, టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ‘ధర్మో రక్షతి..’ అంటూ సాగే ఓ పాటను రిలీజ్ చేశారు. ఈ పాటను వంశీ సరోజిని వికాస్ రాయగా భవాని రాకేష్ సంగీత దర్శకత్వంలో సాయి చరణ్ భాస్కరుణి, అరుణ్ కౌండిన్య, హర్ష వర్దన్ చావలి పాడారు. యముడి కర్తవ్యాన్ని, బాధ్యతల్ని చాటి చెప్పేలా ఈ పాట సాగింది. మీరు కూడా పాట వినేయండి..
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న యముడు సినిమా త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.