హ్యాపీ బర్త్‌డే ధనుష్.. ఆసక్తికరంగా ‘రకిట రకిట’ సాంగ్..

హ్యాపీ బర్త్‌డే ధనుష్.. ఆసక్తికరంగా ‘రకిట రకిట’ సాంగ్..

Updated On : February 22, 2021 / 8:48 PM IST

కోలీవుడ్ స్టార్ ధ‌నుష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న చిత్రం ‘జగమే తంత్రం’. త‌మిళంలో ‘జ‌గమే తంతిర‌మ్’ పేరుతో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఐశ్వ‌ర్య ల‌క్ష్మి హీరోయిన్‌గా న‌టిస్తుంది. కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రాన్ని వైనాట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై శ‌శికాంత్ నిర్మిస్తున్నారు.

 Rakita Rakita Rakita Telugu Lyrical Songధనుష్ పుట్టినరోజు సందర్భంగా సంతోష్ నారాయ‌ణన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం నుండి మంగ‌ళ‌వారం ‘ర‌కిట ర‌కిట‌..’ అనే సాంగ్‌ను తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల చేశారు. భాస్కరభట్ల లిరిక్స్ రాయగా, అనంతు, సుషా, సంతోష్ నారాయ‌ణన్ పాడారు. ధ‌నుష్ న‌టిస్తోన్న 40వ చిత్ర‌మిది. వెంక‌ట్ కాచ‌ర్ల డైలాగ్స్ అందిస్తున్నారు. త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.