Jagapathi Babu : ఆ సినిమా చేసినందుకు కాకినాడ నుంచి ఫోన్ చేసి మరీ తిట్టాడు.. జగపతి బాబుని తిట్టిన అభిమాని..
ఓ సినిమా గురించి చెప్తూ ఆ సినిమా చేసినందుకు ఫ్యాన్ ఫోన్ చేసి మరీ తిట్టిన విషయాన్ని తెలిపాడు. (Jagapathi Babu)
Jagapathi Babu
Jagapathi Babu : జగపతి బాబు ప్రస్తుతం విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. గతంలో హీరోగా స్టార్ డమ్ చూసిన జగపతి బాబు మధ్యలో ఫ్లాప్స్ రావడం, డబ్బులు పోవడంతో కొన్ని సిన్మాలు నచ్చకపోయినా కేవలం డబ్బుల కోసమే చేయాల్సి వచ్చింది.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జగపతి బాబు అలా చేసిన ఓ సినిమా గురించి చెప్తూ ఆ సినిమా చేసినందుకు ఫ్యాన్ ఫోన్ చేసి మరీ తిట్టిన విషయాన్ని తెలిపాడు.
Also See : Tejaswini Vygha : కొడుకుతో కలిసి కంచిలో ఆలయాలు సందర్శిస్తున్న దిల్ రాజు భార్య.. ఫొటోలు..
జగపతి బాబు మాట్లాడుతూ.. ‘ఆరు’ అనే ఒక సినిమా చేశాను. నేను వరస్ట్ పొజిషన్ లో ఉన్నప్పుడు డబ్బుల కోసం చేశాను ఆ సినిమా. అది ఫ్లాప్ అవుతుందని ముందే తెలుసు. అసలు రిలీజ్ కూడా అవ్వదు అనుకున్నాను. నాకు కాకినాడలో ఓ పెద్ద ఫ్యాన్ ఉన్నాడు. వాడు ఆ ఆరు సినిమా రిలీజయ్యాక చూసి నాకు ఫోన్ చేసాడు. ఫోన్ చేసి ఏంట్రా ఆరా, రేపు ఏడు, ఐదు అని తీస్తావా? నీకు తిండి లేకపోతే చెప్పు మా ఇంటికి రా నేను పెడతాను కానీ ఇలాంటి ఎదవ సినిమాలు చేయకు అని తిట్టినట్టు తెలిపారు. దీంతో జగపతి బాబు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
జగపతి బాబు హీరోగా శ్రీకాంత్ లింగద్ దర్శకత్వంలో ఆరు అనే సినిమా మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కింది. 2012 లో ఈ సినిమా రిలీజయి ఫ్లాప్ గా నిలిచింది.
