Jai Bhim Trailer : న్యాయస్థానం మౌనం.. చాలా ప్రమాదకరం..
వెర్సటైల్ యాక్టర్ సూర్య లాయర్ క్యారెక్టర్‌లో నటిస్తున్న ‘జై భీమ్’ నవంబర్ 2 నుండి స్ట్రీమింగ్ కానుంది..

Jai Bhim Telugu Trailer
Jai Bhim Trailer: వెర్సటైల్ యాక్టర్ సూర్య నటిస్తున్న 39వ సినిమా ‘జై భీమ్’.. 2 డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మీద సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జ్ఞానవేల్ డైరెక్టర్. సూర్య లాయర్‌గా కనిపించనున్నారు.
Allu Arha : అల్లు అర్హ పుట్టుకతోనే సూపర్‌స్టార్
ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రోమోలకు మంచి స్పందన లభించింది. శుక్రవారం ‘జై భీమ్’ తెలుగు, తమిళ్ ట్రైలర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తి కరంగా ఉండడంతో పాటు సినిమా మీద అంచనాలు పెంచింది.
Sarkaru Vaari Paata : స్పెయిన్‌లో సాలిడ్ పాట..
తాను పనిచేసే న్యాయ స్థానాన్ని, న్యాయ వ్యవస్థను సవాలు చేస్తూ పేదల తరపున పోరాడే పవర్‌ఫుల్ లాయర్ క్యారెక్టర్‌లో సూర్య పర్ఫార్మెన్స్ సింప్లీ సూపర్బ్. డైలాగ్స్, విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ చక్కగా కుదిరాయి. ప్రకాష్ రాజ్, రజీషా విజయన్, మణికందన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. నవంబర్ 2 నుండి తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో ‘జై భీమ్’ స్ట్రీమింగ్ కానుంది.