Anirudh : అనిరుధ్‌కి కూడా కాస్ట్‌లీ కారు గిఫ్టుగా ఇచ్చిన జైలర్ నిర్మాత.. కారుతో పాటు..

జైలర్ సినిమా భారీ విజయం అందుకోవడంతో చిత్ర నిర్మాత కళానిధి మారన్(Kalanithi Maran) ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

Anirudh : అనిరుధ్‌కి కూడా కాస్ట్‌లీ కారు గిఫ్టుగా ఇచ్చిన జైలర్ నిర్మాత.. కారుతో పాటు..

Jailer Producer Kalanithi Maran gives Porsche Car and some amount as gift to Music Director Anirudh

Updated On : September 5, 2023 / 9:44 AM IST

Anirudh :  సూపర్ స్టార్ ర‌జినీకాంత్ (Rajinikanth) చాలా రోజుల తర్వాత ‘జైలర్’(Jailer) సినిమాతో భారీ విజయం సాధించారు. నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన జైలర్ సినిమా ఆగ‌స్టు 10న రిలీజ్ అయి భారీ విజయం సాధించి కలెక్షన్స్ రాబడుతుంది. ఇప్పటికే జైలర్ సినిమా దాదాపు 650 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. జైలర్ సినిమా భారీ విజయం అందుకోవడంతో చిత్ర నిర్మాత కళానిధి మారన్(Kalanithi Maran) ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

దీంతో సినిమాకు పని చేసిన వాళ్లకు కాస్ట్ లీ గిఫ్ట్స్ ఇస్తున్నారు. ఇప్పటికే రజినీకాంత్ కి కాస్ట్ లీ BMW కారుని గిఫ్ట్ గా ఇచ్చారు. దీంతో పాటు ఇంకో 100 కోట్ల రెమ్యునరేషన్ కూడా ఇచ్చినట్టు సమాచారం. అలాగే డైరెక్టర్ నెల్సన్ కి కూడా కాస్ట్ లీ పోర్షే కారు గిఫ్ట్ ఇచ్చారు. దాంతో పాటు కొంత అమౌంట్ కూడా చెక్ ఇచ్చారు. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్(Anirudh) కి కూడా కాస్ట్ లీ పోర్షే కారుతో పాటు కొంత అమౌంట్ చెక్ కూడా గిఫ్ట్ గా ఇచ్చారు నిర్మాత. అమౌంట్ కోటి రూపాయల వరకు ఉండొచ్చని సమాచారం.

Vijay Devarakonda : డబ్బులు ఇచ్చి మరీ నా మీద, నా సినిమా మీద నెగిటివ్‌గా రాపిస్తున్నారు.. విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు..

నిర్మాత కళానిధి మారన్ స్వయంగా కలిసి ఈ కార్లను, చెక్స్ ని అందచేశారు. దీంతో ఈ ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. అలాగే చిత్రయూనిట్ కి కూడా కొంతమందికి గిఫ్ట్స్ ఇచ్చినట్టు కోలీవుడ్ సమాచారం. ఇక జైలర్ సినిమా సెప్టెంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి రానుంది.