Janhvi Kapoor : ఆంటీతో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన జాన్వీ..
తాను నటించిన హారర్, థ్రిల్లర్ ‘రూహీ’ సినిమాలోని ‘నదియొ పార్ ఇస్’ పాటకు ఆంటీ మహీప్ కపూర్ (సంజయ్ కపూర్ భార్య)తో కలిసి జాన్వీ డ్యాన్స్ చేసింది..

Janhvi Kapoor (image:instagram)
Janhvi Kapoor: శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ వరుసగా స్టోరి ఓరియంటెడ్ సినిమాలు, డిఫరెంట్ క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకుంటూ తక్కువ టైంలోనే ఆడియన్స్ చేత యాక్ట్రెస్‌గా మంచి మార్కులు వేయించుకుంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా అమ్మడు సోషల్ మీడియాను మాత్రం అస్సలు మిస్ అవదు.
View this post on Instagram
తన పిక్స్, అప్‌డేట్స్, డ్యాన్స్ వీడియోలతో రచ్చ రచ్చ చేస్తుంటుంది. రీసెంట్‌గా తాను నటించిన హారర్, థ్రిల్లర్ ‘రూహీ’ సినిమాలోని ‘నదియొ పార్ ఇస్’ పాటకు ఆంటీ మహీప్ కపూర్ (సంజయ్ కపూర్ భార్య)తో కలిసి జాన్వీ డ్యాన్స్ చేసింది. ఎల్లో డ్రెస్‌లో అందాలారబోస్తూ కుర్రకారుకి కిక్ ఇచ్చింది జాన్వీ. ఇక ఆంటీ మహీ అయితే బ్లాక్ డ్రెస్సులో హాట్‌గా కనిపించి అదరగొట్టేసింది. ఇద్దరూ ఫుల్ ఎనర్జిటిక్‌గా స్టెప్స్ వేశారు.
అలాగే మహీప్ కపూర్ తన ఫ్రెండ్ సీమా కపూర్‌తో కలిసి ఉన్న పిక్స్ షేర్ చెయ్యగా వైరల్ అవుతున్నాయి. బ్లాక్ డ్రెస్సులో స్టెలిష్‌గా కనిపిస్తున్న మహీ ‘బెంగుళూరు డైరీస్’ అంటూ షేర్ చేసిన ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. జాన్వీ ప్రస్తుతం ‘దోస్తానా 2’, ‘గుడ్ లక్ జెర్రీ’ సినిమాలు చేస్తోంది.
View this post on Instagram