Janhvi Kapoor : టాప్ హీరోయిన్, స్టార్ ప్రొడ్యూసర్ కూతురుగా జాన్వికపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆరేళ్లవుతుంది. ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్క కమర్షియల్ హిట్ కొట్టలేకపోయింది జాన్వీ. రకరకాల జానర్స్ ట్రై చేస్తున్నా కమర్షియల్ సక్సెస్ రాబట్టలేకపోయింది. స్టార్ కిడ్ గా సినిమాల్లోకి ఎంట్రీఇచ్చి గ్లామర్ హీరోయిన్ అనిపిస్తూనే స్టార్ హీరోయిన్ స్టేటస్ కొట్టెయ్యాల్సిన జాన్వి బాలీవుడ్ లో సాలిడ్ హిట్ ఇప్పటి వరకూ కొట్టనేలేదు.
6 ఏళ్ల క్రితం ధడక్ తో ఎంట్రీ ఇచ్చిన జాన్వి బాక్సాఫీస్ సక్సెస్ చూసిందే లేదు. అందుకే జాన్వికపూర్ టాలీవుడ్ మీద ఆశలు పెట్టుకుంది. బాలీవుడ్ లో బ్రేక్ రావడం లేదు, లాస్ట్ వీక్ రిలీజ్ అయిన ఉలజ్ సినిమా అయినా హిట్ అవుతుంది అనుకుంటే అది పట్టుమని 10 కోట్లు కూడా రాబట్టలేకపోతోంది. 5 రోజుల్లో అయిదున్నర కోట్లు కలెక్ట్ చేసిన ఉలజ్ రోజు రోజుకీ కలెక్షన్ల విషయంలో వెనకపడిపోతోంది. అందుకే జాన్వీ తెలుగు ఇండస్ట్రీ మీదే ఫోకస్ చేస్తోంది.
Also Read : Samantha : వాట్.. ఆ సిరీస్‌కి సమంత అంత రెమ్యునరేషన్ తీసుకుందా? ఫస్ట్ సౌత్ హీరోయిన్‌గా రికార్డ్..?
ఎన్టీఆర్, జాన్వికపూర్ జంటగా తెరకెక్కుతున్న దేవర నుంచి రిలీజైన రొమాంటిక్ సాంగ్ ని సోషల్ మీడియాలో గట్టిగా ప్రమోట్ చేసుకుంటోంది జాన్వి. బాలీవుడ్ PR మీడియా అంతా ఈ సాంగ్ ని, జాన్వీని పొగుడుతూ ప్రమోట్ చేస్తున్నారు. జాన్వీ కెరీర్ లో ఇదే మొదటి రొమాంటిక్ కమర్షియల్ సాంగ్ కావడం గమనార్హం. జాన్వి దేవరకు సంబందించి ప్రతి చిన్న విషయాన్ని ఎగ్జైట్మెంట్ తో పోస్ట్ చేస్తోంది. దేవర సాంగ్ లో జాన్వి, ఎన్టీఆర్ జంట కెమిస్ట్రీ గురించి ఇప్పటికే హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది టాలీవుడ్ లో.
కెరీర్ మైలేజ్ కోసం సక్సెస్ తో పాటు బాక్సాఫీస్ కలెక్షన్లు కూడా చాలా అవసరం. అందుకే టాలీవుడ్ ఎంట్రీ లేట్ అయినా వరసపెట్టి సినిమాలు ఓకే చేసేస్తోంది. ఆల్రెడీ దేవరలో ఎన్టీఆర్ తో ఎంట్రీ ఇస్తున్న జాన్వి ఈ సినిమా తనకి కమర్షియల్ గా బ్రేక్ ఇస్తుందని భావిస్తుంది. దీని తర్వాత టాలీవుడ్ లో రెండో సినిమాగా రామ్ చరణ్ తో కలిసి చేస్తోంది. ఇద్దరు స్టార్ హీరోలు, సాలిడ్ మాస్ స్టోరీలు, ఇద్దరు హీరోలకీ మార్కెట్, కమర్షియల్ స్టామినా ఫుల్ గా ఉంది. దీంతో ఈ సినిమాలతో తనకి కూడా కమర్షియల్ బ్రేక్ వస్తుందని జాన్వీ ఆశపడుతోంది. మరోవైపు నాని సినిమాకు కూడా ఓకె చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే తన అందాలతో టాలీవుడ్ యువత మనసుని దోచుకున్న జాన్వీ సక్సెస్ కోసం ఎదురుచూస్తుంది.