Janhvi Kapoor made shocking comments on the Insider vs Outsider program.
Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. సినీ ఇండస్ట్రీలో నేపోటిజం గురించి మాట్లాడుతూ బయటి వ్యక్తులు ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకోవాలంటే చాలా కష్టపడాలి అంటూ చెప్పుకొచ్చిది. ఇటీవల ఆమె ఇన్‌సైడర్ vs అవుట్‌సైడర్ అనే ప్రోగ్రాంలో పాల్గొంది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పై విదంగా స్పందించింది. ఇంకా ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. బయట వ్యక్తుల కష్టాలు (Janhvi Kapoor)వినడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు కానీ, ఇండస్ట్రీకి చెందినవారు ఇబ్బందులు పడుతున్నామంటే ఎవరూ పట్టించుకోరు అని తెలిపింది.
Mirai OTT: మిరాయ్ ఓటీటీలోకి వచ్చేస్తుంది.. డేట్ ఇదే.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..
“బయట వ్యక్తులు, ఇండస్ట్రీకి చెందినవారు అని వేరు చేసి మాట్లాడటం నాకు ఇష్టం లేదు. బయట నుంచి వచ్చినవారితో ఇండస్ట్రీలో వారితో పోల్చడం అన్యాయం. స్టార్ కిడ్స్ తమ ఇబ్బందులు చెప్పుకుంటే విడ్డూరంగా అనిపిస్తుంది. వాటిని వినడానికి కూడా ఆసక్తి చూపించారు. అలాగే స్టార్ కిడ్స్ కూడా తాము ఇన్ని కష్టాలు పడ్డామని చెప్పుకోరు. ఎందుకంటే వారికి లభించిన సౌకర్యాలకు కృతజ్ఞతగా ఉంటారు. బయటి వ్యక్తులు ఇండస్ట్రీలో గుర్తింపుతెచ్చుకోవాలంటే ఎన్నో పోరాటాలు చేయాలి. అది నేను కూడా అంగీకరిస్తాను. ఆ సమస్యలు ఇండస్ట్రీలో ఉండే స్టార్ కిడ్స్‌కి అర్థం కావు” అంటూ చెప్పుకొచ్చింది జాన్వీ. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక జాన్వీ కపూర్ సినిమాల విషయానికి వస్తే, తెలుగులో ఆమె ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో ‘పెద్ది” సినిమా చేస్తోంది. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రూరల్ బ్యాక్డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో తన క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.