Janhvi Kapoor : జూనియ‌ర్ ఎన్టీఆర్ పై జాన్వీక‌పూర్‌ ప్ర‌శంస‌ల వ‌ర్షం.. ఎనర్జిటిక్ హీరో.. నాకు 10 రోజులు ఆయ‌న‌కు..

దివంగ‌త అతిలోక సుంద‌రి శ్రీదేవి త‌న‌య‌గా సినీప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకుంది జాన్వీ క‌పూర్.

Janhvi Kapoor Talks about her experience of working with JR NTR

Janhvi Kapoor – JR NTR : దివంగ‌త అతిలోక సుంద‌రి శ్రీదేవి త‌న‌య‌గా సినీప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకుంది జాన్వీ క‌పూర్. బాలీవుడ్‌లో ఇప్ప‌టికే తానేంటో నిరూపించుకుంది. దేవ‌ర సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ హృద‌యాల‌ను కొల్ల‌గొట్టేందుకు సిద్ధం అవుతోంది. బాలీవుడ్ మూవీ ‘ఉలఝ్‌’ షూటింగ్ ను పూర్తి చేసింది. ఈ చిత్రం ఆగ‌స్టు 2న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్ర‌చారంలో భాగంగా ప‌లు జాన్వీ ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో పాల్గొంటోంది. ఈ క్ర‌మంలో ఎన్టీఆర్ హీరోగా న‌టిస్తున్న దేవ‌ర సినిమా షూటింగ్‌కు సంబంధించిన విష‌యాల‌ను పంచుకుంది.

కాగా.. ఇటీవ‌ల ఎన్టీఆర్‌, జాన్వీల పై ఓ సాంగ్ షూటింగ్‌ను పూర్తి చేశారు. దీనిపై మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పై ప్ర‌శంస‌లు కురిపించింది. ఎలాంటి స్టెప్‌ను అయినా స‌రే ఎన్టీఆర్ ఒక్క సెక‌నులో నేర్చుకోగ‌ల‌ర‌ని, అదే స్టెప్పును తాను నేర్చుకునేందుకు మాత్రం 10 రోజుల స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు. చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో ఎన్టీఆర్ డ్యాన్స్ వేగాన్ని చూసి ఆశ్చ‌ర్య‌పోయిన‌ట్లు వెల్ల‌డించింది.

Viraaji : ఆడియన్స్ అట్రాక్షన్ కోసం వరుణ్ సందేశ్‌కి ఆ గెటప్ వేయలేదు.. విరాజి సినిమాపై నిర్మాత..

జూనియ‌ర్ ఎన్టీఆర్ ఓ ఎనర్జిటిక్ హీరో అని చెప్పుకొచ్చింది. ఆయ‌న రాగానే సెట్‌కే క‌ళ వ‌స్తుంద‌ని, అంద‌రూ ఉత్సాహంగా ఉంటారంది. ఇక ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ గురించి మాట్లాడుతూ.. ఆయ‌న ఎంతో ప్ర‌శాంతంగా ఉంటార‌ని తెలిపింది. ఏ విష‌యానైనా ఎంతో సున్నితంగా చెబుతార‌ని, ఆయ‌న‌తో క‌లిసి ప‌ని చేయ‌డం చాలా సుల‌భం అని అంది.

తెలుగు వారి ప‌ని తీరు త‌న‌కు చాలా ఇష్టం అని తెలిపింది. క‌ళ‌ను, సినిమాను ఎంతో గౌర‌విస్తార‌ని, ఎంతో హుందాగా ప్ర‌వ‌ర్తిస్తార‌ని చెప్పింది. ఇక ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండాల‌ని త‌న త‌ల్లిదండ్రులు త‌న‌కు నేర్చించార‌ని, వాళ్ల‌తో పాటు అభిమానులు అంద‌రూ గ‌ర్వ‌పడేలా ఉంటాన‌ని జాన్వీ తెలిపింది. త‌న జీవితం ప్ర‌స్తుతం ఎంతో సంతోషంగా ఉందంది. కాగా.. ఇటీవ‌ల ఆరోగ్య ప‌రంగా కొంచెం ఇబ్బంది ప‌డ్డాన‌ని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న‌ట్లు తెలిపింది.

Bellamkonda Sreenivas : బెల్లంకొండ శ్రీనివాస్ మంచి మ‌న‌సు.. అంధుల‌కు సాయం.. ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ప‌దేళ్లు..

 

ట్రెండింగ్ వార్తలు