Janhvi Kapoor Ulajh Movie Teaser Released
Janhvi Kapoor Ulajh Teaser : బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ లో దేవర, చరణ్ సినిమాలతో రాబోతుంది. ఇవే తనకి మొదటి కమర్షియల్ సినిమాలు. గతంలో జాన్వీ చేసినవి చాలా వరకు కాన్సెప్ట్, లేడీ ఓరియెంటెడ్ సినిమాలే. ఇప్పుడు మళ్ళీ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో రాబోతుంది జాన్వీ. తాజాగా బాలీవుడ్ లో తన నెక్స్ట్ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.
జాన్వీ కపూర్ మెయిన్ లీడ్ గా ‘ఉలజ్’ అనే సినిమా రాబోతుంది. సుధాన్షు సరియా దర్శకత్వంలో జంగ్లీ పిక్చర్స్ నిర్మాణంలో అదిల్ హుస్సేన్, గుల్షన్ దేవయ్య ముఖ్య పాత్రలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ గా కనిపించబోతుంది. దేశానికి, విదేశాంగ శాఖకి సంబంధించిన కథగా, థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతున్నట్టు తెలుస్తుంది.
Also Read : Anasuya : అనసూయ చిన్నప్పటి ఫొటో చూశారా? ఎంత క్యూట్‌గా ఉందో..
తాజగా ఉలజ్ టీజర్ రిలీజ్ చేయగా ప్రస్తుతం టీజర్ ట్రేండింగ్ లో ఉంది. ఈ టీజర్లోనే జాన్వీ అదరగొట్టింది అని కామెంట్స్ చేస్తూ జాన్వీని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మరి ఈ సినిమా జాన్వీకి ఏ రేంజ్ సక్సెస్ ఇస్తుందో చూడాలి. ఇక ఉలజ్ సినిమా జులై 5వ తేదీన రిలీజ్ కాబోతుంది. మీరు కూడా జాన్వీ కపూర్ ఉలజ్ టీజర్ చూసేయండి.