Anasuya : అనసూయ చిన్నప్పటి ఫొటో చూశారా? ఎంత క్యూట్‌గా ఉందో..

అనసూయ తన చిన్నప్పటి ఫొటోతో పాటు ఇప్పటి ఫోటోని కలిపి ఓ వీడియోగా పోస్ట్ చేసింది.

Anasuya : అనసూయ చిన్నప్పటి ఫొటో చూశారా? ఎంత క్యూట్‌గా ఉందో..

Actress Anasuya Bharadwaj Childhood Photo goes Viral

Updated On : April 17, 2024 / 10:29 AM IST

Anasuya Bharadwaj : యాంకర్ గా బాగా పాపులారిటీ తెచ్చేసుకొని ప్రస్తుతం నటిగా బిజీ అయిపోయింది అనసూయ. త్వరలో పుష్ప 2 సినిమాతో అనసూయ ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక మరో వైపు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫొటోలు పోస్ట్ చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది అనసూయ. అప్పుడప్పుడు తాను పోస్ట్ చేసే కామెంట్స్ తో వైరల్ కూడా అవుతూ ఉంటుంది. తాజాగా అనసూయ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

Also Read : HariHara VeeraMallu : పవన్ ‘హరిహర వీరమల్లు’ శ్రీరామనవమి స్పెషల్ అప్డేట్.. ధర్మం కోసం యుద్ధం అంటూ..

అనసూయ తన చిన్నప్పటి ఫొటోతో పాటు ఇప్పటి ఫోటోని కలిపి ఓ వీడియోగా పోస్ట్ చేసింది. ఓ పాప్ సాంగ్ తో ఈ వీడియోని పోస్ట్ చేసింది. చిన్నప్పుడు క్యూట్ గా ఉన్న అనసూయ ఇప్పుడు హాట్ గా కనపడేలా డ్రెస్సింగ్ తో పోజులు ఇచ్చింది. దీంతో అనసూయ చిన్నప్పటి ఫొటో వైరల్ గా మారింది. అప్పటి ఫోటోని, ఇప్పుడు అనసూయ పోస్ట్ చేస్తున్న హాట్ హాట్ ఫోటోలని కంపేర్ చేస్తూ అనసూయ చాలా మారింది అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక చిన్నప్పుడు భలే క్యూట్ గా ఉంది అనసూయ అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరోసారి తన చిన్నప్పటి ఫొటోతో అనసూయ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.