Naga Chaitanya : నాగ చైతన్యతో జాన్వీ.. ఆ స్టార్ డైరెక్టర్ తో లక్కీ ఛాన్స్ కొట్టేసారుగా..

Janhvi Kapoor with Naga Chaitanya Lucky chance with that star director

Naga Chaitanya : బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగులో కూడా సత్తా చాటుతుంది. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసి సక్సెస్ అయిన జాన్వీ టాలీవుడ్ లో కూడా అదే జోరు చూపిస్తుంది. ఇప్పటికే దేవర సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మొదటి సినిమాతోనే భారీ సక్సెస్ అయ్యింది.

నాగచైతన్య హీరోగా నటించబోయే ఓ సింపుల్ లవ్ స్టోరీలో జాన్వీని హీరోయిన్ గా ఫిక్స్ చేశారన్న వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈసినిమాను చైతు తన లక్కీ దర్శకుడితో చేస్తున్నారట. ఆ డైరెక్టర్ మరెవరో కాదు ‘మజిలీ’ డైరెక్టర్ శివ నిర్వాణ. ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ సినిమా చేస్తున్నారు. చందూ మొండేటి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తుంది.

Also Read : Lucky Baskhar : ‘లక్కీ భాస్కర్’ మూవీ రివ్యూ.. కామన్ మ్యాన్ డబ్బుతో ఆడిన ఆట..

ఇప్పటికే దేవరతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కూడా ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పుడు నాగ చైతన్యతో చేస్తుందని తెలియడంతో జాన్వీ ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు .