Kiran Abbavaram : ‘చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోతున్నా’.. కిరణ్ అబ్బవరం

Kiran Abbavaram : ‘చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోతున్నా’.. కిరణ్ అబ్బవరం

Kiran Abbavaram Sleeping happily after a long time

Updated On : October 31, 2024 / 11:00 AM IST

Kiran Abbavaram : టాలీవుడ్ టాలెంటెడ్ హీరో కిరణ్‌ అబ్బవరం నటించిన సరికొత్త చిత్రం ‘క’. సుజీత్‌ – సందీప్‌ సంయుక్త దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దీపావళి కానుకగా నేడు (గురువారం) రిలీజ్ అయ్యింది. ఈనేపథ్యంలోనే ‘క’ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తుంది. దీంతో ఈ విషయంపై హీరో కిరణ్‌ ఆనందం వ్యక్తం చేశారు. తన మనసు ఆనందంతో నిండిపోయింది అన్నారు.

Also Read  : KA Movie : కిరణ్ అబ్బవరం ‘క’ మూవీ రివ్యూ.. అదిరిందిగా.. క్లైమాక్స్ ఎవ్వరూ ఊహించలేరు..

తాజాగా తన సోషల్ మీడియా వేదికగా కిరణ్ ఇలా పేర్కొన్నారు.. ‘‘చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోతున్నా. ఈ దీపావళి నాకు మరింత సంతోషకరమైన రోజుగా మార్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అందరికీ హ్యాపీ దీపావళి’’ అని అయన పోస్ట్ లో పేర్కొన్నారు. అలాగే ఈ పోస్ట్ కి కొందరు నెటిజన్లు స్పందిస్తూ.. ‘కంగ్రాట్స్‌’ చెబుతున్నారు. ఇకపోతే కిరణ్ అబ్బవరం నటించిన మొదటి పాన్ ఇండియా సినిమా ఇది.

ఇప్పటికే పలు మరిన్ని ఫ్లాప్స్  తో సతమతమవుతున్న కిరణ్ పాన్ ఇండియా స్థాయిలో ‘క’ సినిమాతో హిట్ టాక్ తెచ్చుకున్నారు. మరి ముందుముందు కిరణ్ నుండి మరిన్ని పాన్ ఇండియా సినిమాలు వస్తాయా లేదా అన్నది చూడాల్సి ఉంది .