Jathara Movie : ఒక పెద్ద హీరోతో ఈ సినిమా చేయాలి.. ఆరు నెలలు ప్రయత్నించినా అవ్వకపోవడంతో..

చిత్తూరు జిల్లా బ్యాక్ డ్రాప్‌లో జరిగే ఓ జాతర నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 8న విడుదల కానుంది.

Jathara Movie Director Hero Sathish Babu Ratakonda Interesting Comments about Movie

Jathara Movie : సతీష్ బాబు రాటకొండ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా ‘జాతర’. గల్లా మంజునాథ్ సమర్పణలో మూవీటెక్ ఎల్‌ఎల్‌సితో కలిసి రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి నిర్మాణంలో రా అండ్ రస్టిక్ గా ‘జాతర’ సినిమా తెరకెక్కింది. చిత్తూరు జిల్లా బ్యాక్ డ్రాప్‌లో జరిగే ఓ జాతర నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 8న విడుదల కానుంది.

తాజాగా హీరో, దర్శకుడు సతీష్ బాబు రాటకొండ మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి, తన గురించి తెలిపాడు. సతీష్ బాబు ఈ సినిమా ఎలా మొదలయింది అని చెప్తూ.. 2016 లోనే నేను జాతర స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాను. అనుకోకుండా ఓ ఫంక్షన్ లో నిర్మాతతో మీట్ అయ్యాం. అలా మొదలయిన ప్రాజెక్టు నిర్మాత నన్నే డైరెక్షన్ చేయమనడంతో ఓకే అన్నాను. ముందు ఈ సినిమాని వేరే హీరోతోనే చేద్దాం అనుకున్నాం. ఒక పెద్ద హీరోతో జాతర సినిమా చేయాలి. ఆ హీరో కోసం ఆరు నెలల పాటు ప్రయత్నించినా కుదరలేదు. దాంతో నేనే హీరోగా నటించాను. అలాగే సినిమాలో పెద్ద ఆర్టిస్టులను పెడదామని అన్నా నేను వద్దని చెప్పాను. ఇది లోకల్ కథ. అక్కడి నటీనటులు, తెలుగు వచ్చిన వాళ్ళు అయితేనే బాగుంటుందని భావించాం. ఓ తెలుగమ్మాయిని హీరోయిన్ అనుకున్నా మా బడ్జెట్ లో రాకపోవడంతో దీయా రాజ్ ని తీసుకున్నాం అని తెలిపారు.

Also Read : Suriya – Jyotika : జ్యోతిక లేకుండా నా లైఫ్ ఊహించుకోలేను.. బాలయ్య షోలో జ్యోతికకు ఐ లవ్ యు చెప్పిన సూర్య..

జాతర సినిమా గురించి చెప్తూ.. చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసర గ్రామాల్లో ఈ అమ్మవారి గుడి ఉంటుంది. చుట్టుపక్కల 18 ఊళ్ల ప్రజలు ఈ గుడికి వచ్చి అమ్మవారిని కొలుస్తారు. ఏడాదిన్నర పాటు ఆ ప్రాంతంలో ప్రజలతో మాట్లాడి రీసెర్చ్ చేసి రాసుకున్నాను. దేవుడు మనుషులను బొమ్మలుగా చేసి జగన్నాటకం ఆడిస్తాడని మన పురాణాల్లో అంటారు. ఇందుకు భిన్నంగా ఒక మనిషి దేవుడిని పితలాటకం ఆడిస్తే దాన్నుంచి అమ్మవారిని హీరో ఎలా కాపాడాడు అనేది మెయిన్ పాయింట్. మనిషి రాక్షసుడై అమ్మవారిని చెరపడితే మరో నరుడు హరుడై ఆ రాక్షసుడిని ఎలా సంహరించాడు అనేది మా ‘జాతర’లో చూపిస్తున్నాం. ఈ సినిమాని డాక్యుమెంటరీగా తీస్తే వివాదం అవుతుంది. అందుకే కొన్ని ఫిక్షన్ జతచేసి సినిమాగా మార్చాము అని తెలిపారు.

సినిమా టెక్నికల్ అంశాల గురించి మాట్లాడుతూ.. జంధ్యాల గారి సినిమాల్లో విన్నట్లు విలేజ్ లో వినిపించే సహజమైన సౌండ్స్ తరహాలో జాతర సినిమాలో సౌండ్ డిజైనింగ్ చేయించాం. మా సినిమాకు యూఎస్, యూకేలో ఫిలింస్ కు వర్క్ చేసే మూవీ టెక్ అనే కంపెనీ ప్రొడక్షన్ లో జాయిన్ గ్రాఫిక్స్ తో పాటు షూటింగ్ టైమ్ లో టెక్నికల్ గా చాలా సపోర్ట్ చేసారు అని తెలిపారు.