Suriya – Jyotika : జ్యోతిక లేకుండా నా లైఫ్ ఊహించుకోలేను.. బాలయ్య షోలో జ్యోతికకు ఐ లవ్ యు చెప్పిన సూర్య..

సూర్య, జ్యోతిక ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

Suriya – Jyotika : జ్యోతిక లేకుండా నా లైఫ్ ఊహించుకోలేను.. బాలయ్య షోలో జ్యోతికకు ఐ లవ్ యు చెప్పిన సూర్య..

Suriya says i love you to Jyotika in Balayya Unstoppable Show

Updated On : November 5, 2024 / 2:09 PM IST

Suriya – Jyotika : తాజాగా సూర్య బాలయ్య అన్‌స్టాపబుల్ షోకు వచ్చారు. కంగువ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సూర్య, బాబీ డియోల్, డైరెక్టర్ శివ షోకి వచ్చి సందడి చేసారు. తాజాగా అన్‌స్టాపబుల్ సీజన్ 4 మూడో ఎపిసోడ్ ప్రోమో విడుదల చేసారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది.

Also Read : Suriya : బాలయ్య షోలో ఆ విషయంలో ఎమోషనల్ అయిన సూర్య.. తెలుగు వాళ్ళే ఎక్కువ స్పాన్సర్ చేస్తున్నారు..

సూర్య, జ్యోతిక ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సెలబ్రిటీలతో క్యూట్, బెస్ట్ కపుల్స్ లో ఈ జంట కూడా ఒకరు. ఒకరి గురించి ఒకరు ఎప్పుడూ గొప్పగా చెప్తారు. తాజాగా అన్‌స్టాపబుల్ షోలో జ్యోతిక ప్రస్తావన రాగా సూర్య.. జ్యోతిక లేకుండా నా లైఫ్ అస్సలు ఊహించుకోలేను. ఐ లవ్ యు అంటూ చెప్పాడు. దీంతో సూర్య – జ్యోతిక ఫ్యాన్స్ క్యూట్ అంటూ ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు.