Jathi Ratnalu Deleted Scenes: జాతిరత్నాలు.. ఈ సీన్లు ఎందుకు డిలేట్ చేశారో?

Jathi Ratnalu Deleted Scenes
Jathi Ratnalu Deleted Scenes: సినిమా ఎడిటింగ్ సమయంలో సీన్లు డిలేట్ చేస్తూనే ఉంటారు. సినిమాలో అనవసరంగా అనిపించినవి. సినిమాలో ఇతర కారణాలతో సీన్‌లు డిలేట్ చేస్తుండడం చూస్తూనే ఉంటాం.. ఈ క్రమంలోనే టాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ.. జాతిరత్నాలులో కొన్ని సీన్‌లను డిలేట్ చేయగా.. వాటిని యూట్యూబ్‌లో పెట్టింది చిత్రయూనిట్..
ఈ సీన్లు ఎందుకు డిలీట్ చేశారయ్యా అనే క్యాప్షన్‌తో ఒకే వీడియోలో అన్నీ డిలేటెడ్ సీన్లను విడుదల చేసింది చిత్రయూనిట్. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రల్లో తెరకెక్కిన జాతిరత్నాలు.. 2021 సంవత్సరంలో విడుదలై సూపర్ హిట్ అయిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న సినిమా ‘జాతి రత్నాలు’ సినిమాకి అనుదీప్ దర్శకత్వం వహించారు.
ఈ సినిమాను మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించగా సినిమా పాజిటివ్ టాక్‌తో విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శింపబడుతోంది. అయితే లేటెస్ట్ డిలేట్ చేసిన సీన్లపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వస్తున్నాయి. డిలేట్ చేసి మంచిపని చేశారని కొందరు అంటుంటే.. ఈ సీన్లు కూడా మస్తుగున్నయి అని విభిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.