వారం ముందుగానే ‘జవానీ జానేమన్’

సైఫ్ అలీ ఖాన్, టబు, అలియా ఎఫ్ ప్రధానపాత్రల్లో నటించిన ‘జవానీ జానేమన్’ న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్..

  • Published By: sekhar ,Published On : January 22, 2020 / 11:31 AM IST
వారం ముందుగానే ‘జవానీ జానేమన్’

Updated On : January 22, 2020 / 11:31 AM IST

సైఫ్ అలీ ఖాన్, టబు, అలియా ఎఫ్ ప్రధానపాత్రల్లో నటించిన ‘జవానీ జానేమన్’ న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్..

సైఫ్ అలీ ఖాన్, టబు, అలియా ఎఫ్ ప్రధానపాత్రల్లో నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. ‘జవానీ జానేమన్’.. నితిన్ కక్కర్ దర్శకత్వంలో, బ్లాక్ నైట్ ఫిల్మ్స్, నార్తర్న్ లైట్స్ ఫిల్మ్స్, పూజా ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు  సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాతో పూజాబేడి కూతురు అలియా ఎఫ్ బాలీవుడ్‌కి పరిచయమవుతుంది.

Image result for jawani jaaneman

తండ్రీకూతుళ్ల అనుబంధం ఆధారంగా తెరకెక్కుతున్న ‘జవానీ జానేమన్’లో అలియా, సైఫ్ కూతురిగా నటిస్తోంది. అమర్ ఖన్నాగా సైఫ్, జయా బక్షిగా టబు నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా న్యూ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ కొత్త పోస్టర్ విడుదల చేశారు. ముందుగా ప్రేమికుల దినోత్సవం కానుకగా 2020 ఫిబ్రవరి 7న ‘జవానీ జానేమన్’ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. కట్ చేస్తే వారం ముందుగానే రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.

Read Also : ‘జాను’ రిలీజ్ డేట్ ఫిక్స్

Image

జనవరి 31న ‘జవానీ జానేమన్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. సైఫ్ నిర్మాణంలో కూడా భాగస్వామ్యం వహించడం విశేషం. కుబ్రా సైత్, చుంకీ పాండే తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు బినోద్ ప్రధాన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.