Jaya Prakash Reddy Daughter and Son in Law Entry into Film Industry
Jaya Prakash Reddy : విలన్ గా, కమెడియన్ గా దాదాపు 300లకు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు జయప్రకాశ్ రెడ్డి. 2020 కరోనా సమయంలో ఆయన మరణించారు. ఇన్ని రోజులు ఆయన కుటుంబం నుంచి ఎవరూ సినీ పరిశ్రమలోకి రాలేదు. ఇప్పుడు ఆయన కూతురు, అల్లుడు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు.
తాజాగా జయప్రకాశ్ రెడ్డి కూతురు మల్లికా రెడ్డి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా వాళ్ళ సినీ ఎంట్రీ గురించి మాట్లాడారు.
మల్లికారెడ్డి మాట్లాడుతూ.. చిన్నపట్నుంచి నాకు సినిమాలు ఇంట్రెస్ట్ ఉంది కానీ నాన్న సినిమాల్లోకి రానివ్వలేదు, నేను అడగలేదు. మా తమ్ముడికి అసలు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు నేను నిర్మాతగా మారి ఒక సినిమా చేస్తున్నాను. అది షూటింగ్ దశలో ఉంది. ఇకపై నిర్మాతగా సినిమాలు చేస్తాను. అవకాశాలు వస్తే నటిగా కూడా నటిస్తాను. నేను నిర్మాతగా మొదటి సినిమా చేసే ముందు వృషభ అనే ఒక సినిమాకి సహా నిర్మాతగా పనిచేసాను.
ఆ మూవీలో మా ఆయన నటుడిగా చేసారు. ఓ రోజు షూటింగ్ చూడటానికి మా ఆయన వచ్చారు. ఆ రోజు హీరోయిన్ ఫాదర్ పాత్ర వేసే నటుడు కొన్ని కారణాలతో రాకపోవడంతో ఆ పాత్రని మా ఆయన చేసారు. మా ఆయన సివిల్ ఇంజనీర్, పంచాయితీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తారు. డైరెక్టర్ మా ఆయన్ని చూసి నటించమని అడిగితే మొదట వద్దన్నారు. కానీ చేసారు. సినిమా మొత్తం హీరోయిన్ ఫాదర్ పాత్రలో కనిపిస్తారు. ఆ సినిమా త్వరలో రిలీజ్ అవుతుంది. నేను గతంలో ఒక షార్ట్ ఫిలిం కూడా చేశాను. నా చిన్న కొడుక్కి సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉంది అని తెలిపింది.