Jaya Prakash Reddy : ‘జయప్రకాశ్ రెడ్డి’కి రెండు పెళ్లిళ్లు అని తెలుసా? మొదటి భార్య ఉండగానే రెండో పెళ్లి ఎందుకంటే..?

తాజాగా ఆయన కూతురు మల్లికా రెడ్డి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా జయప్రకాశ్ రెడ్డికి రెండు పెళ్లిళ్లు అనే విషయాన్ని తెలిపారు.

Jaya Prakash Reddy : ‘జయప్రకాశ్ రెడ్డి’కి రెండు పెళ్లిళ్లు అని తెలుసా? మొదటి భార్య ఉండగానే రెండో పెళ్లి ఎందుకంటే..?

Do You Know Artist Jaya Prakash Reddy done Two Marriages said by his daughter Mallika Reddy

Updated On : May 22, 2025 / 12:48 PM IST

Jaya Prakash Reddy : టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో కరుడుగట్టిన విలన్ గా, ఫ్యాక్షనిస్ట్ గా, కమెడియన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించారు. దాదాపు 300లకు పైగా సినిమాల్లో నటించిన జయప్రకాశ్ రెడ్డి 2020 కరోనా సమయంలో మరణించారు. ఆయన కూతురు మల్లికా రెడ్డి నిర్మాతగా ఇటీవలే సినీ పరిశ్రమలోకి వచ్చారు. తాజాగా మల్లికా రెడ్డి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా జయప్రకాశ్ రెడ్డికి రెండు పెళ్లిళ్లు అనే విషయాన్ని తెలిపారు.

జయప్రకాశ్ రెడ్డికి 22 ఏళ్లకే గవర్నమెంట్ స్కూల్ లో టీచర్ గా జాబ్ వచ్చింది. జాబ్ రాగానే 22 ఏళ్లకే పెళ్లి చేసారు. పెళ్లి అయిన 8 ఏళ్ళ వరకు కూడా పిల్లలు కలగలేదు. డాక్టర్స్ చుట్టూ తిరగడం, పూజలు చేయడం, గుడులు చుట్టూ తిరగడం చేసినా పిల్లలు లేకపోవడంతో ఇంట్లో రెండో పెళ్లి గురించి ఒత్తిడి తెచ్చారట. అయితే జయప్రకాశ్ రెడ్డి మొదట్లో ఒప్పుకోలేదు. ఆయన భార్య కూడా ఒకే చెప్పడంతో సరే అన్నారు.

Also Read : Vijay Sethupathi : పూరి జగన్నాధ్ సినిమా షూటింగ్ అప్డేట్ ఇచ్చిన విజయ్ సేతుపతి.. ఎప్పట్నుంచి అంటే.. టైటిల్ పై కూడా క్లారిటీ..

ఈ క్రమంలో జయప్రకాశ్ రెడ్డికి వేరే స్కూల్ లో ఉన్న ఒక టీచర్ పరిచయం అయింది. ఆమె గురించి అన్ని కనుక్కొని, ఒకే క్యాస్ట్ అని కూడా తెలుసుకొని పెళ్లి సంబంధం మాట్లాడమని ఇంట్లో చెప్పారట. అలా మొదటి పెళ్లి అయిన పదేళ్లకు జయప్రకాశ్ రెడ్డికి రెండో పెళ్లి అయింది. అయితే రెండో పెళ్లి అయిన కొన్నాళ్లకే మొదటి భార్య కూడా ప్రగ్నెంట్ అయింది. అప్పటికే రెండో భార్య కూడా ప్రగ్నెంట్.

జయప్రకాశ్ రెడ్డి రెండవ భార్యకు మొదట అమ్మాయి పుట్టగా ఆ తర్వాత మొదటి భార్యకు ఒక బాబు పుట్టాడు. ఇద్దరు భార్యలు, పిల్లలతో ఎలాంటి గొడవలు లేకుండా కలిసే ఉండేవారట. జయప్రకాశ్ రెడ్డి సినిమాల్లో బిజీ అయినా రెండో భార్య టీచర్ గా చేసి రిటైర్ అయ్యారు. జయప్రకాశ్ రెడ్డి చనిపోకముందే రెండో భార్య ఆరోగ్య సమస్యలతో చనిపోయారు. మొదటి భార్య ప్రస్తుతం గుంటూరులో తన కొడుకు వద్దే ఉంటున్నారు అని జయప్రకాశ్ రెడ్డి కూతురు మల్లికా రెడ్డి ఈ విషయాలన్నీ తెలిపారు. ఈ రెండు పెళ్ళిళ్ళు గురించి చుట్టాలు అందరికి తెలుసు, ఇండస్ట్రీలో, బయటివాళ్లకు ఎక్కువమందికి తెలియదు అని అన్నారు. దీంతో ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోతున్నారు.

Also Read : HariHara VeeraMallu : ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ డేట్ పై మరోసారి క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. ఫ్యాన్స్ గెట్ రెడీ..