Vijay Sethupathi : పూరి జగన్నాధ్ సినిమా షూటింగ్ అప్డేట్ ఇచ్చిన విజయ్ సేతుపతి.. ఎప్పట్నుంచి అంటే.. టైటిల్ పై కూడా క్లారిటీ..

తాజాగా విజయ్ సేతుపతి తన నెక్స్ట్ సినిమా ఏస్ ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడగా పూరి సినిమా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

Vijay Sethupathi : పూరి జగన్నాధ్ సినిమా షూటింగ్ అప్డేట్ ఇచ్చిన విజయ్ సేతుపతి.. ఎప్పట్నుంచి అంటే.. టైటిల్ పై కూడా క్లారిటీ..

Vijay Sethupathi Comments on his Movie with Puri Jagannadh and gives Shooting Update

Updated On : May 22, 2025 / 12:24 PM IST

Vijay Sethupathi : ఒకప్పుడు స్టార్ హీరోలందరికీ ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన పూరి జగన్నాధ్ గత కొంతకాలంగా సరైన విజయం లేక తడబడుతున్నారు. ఇటీవల కాలంలో ఇస్మార్ట్ శంకర్ తప్ప అన్ని భారీ పరాజయాలు చూసాడు పూరి జగన్నాధ్. పూరి కంబ్యాక్ ఇవ్వాలని ఆయన ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ కూడా కోరుకుంటుంది. టాలీవుడ్ హీరోలు పూరి జగన్నాధ్ ని పట్టించుకోకపోవడంతో తమిళ్ స్టార్ తో ఇటీవల సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్, ఛార్మి నిర్మాణంలో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తమిళ్ స్టార్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా పాన్ ఇండియా సినిమా అనౌన్స్ చేసారు. ఇందులో టబు హీరోయిన్ గా కూడా ప్రకటించారు. కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్ గా చేయబోతున్నాడు. ఈ సినిమాకు బెగ్గర్ అనే టైటిల్ పెట్టారని ప్రచారం జరిగింది.

Also Raed : Jyothi Krishna : పవన్ కళ్యాణ్ మెట్లు కడిగి అలిసిపోయి 2 గంటలు లేట్ గా వచ్చారు.. అయినా.. ఇది కదా పవన్ డెడికేషన్ అంటే..

తాజాగా విజయ్ సేతుపతి తన నెక్స్ట్ సినిమా ఏస్ ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడగా పూరి సినిమా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

విజయ్ సేతుపతి పూరి జగన్నాధ్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఆయన చాలా మంచి మనిషి. ఆయన కథని రెండు రోజులు సగం సగం విందాం అనుకున్నాను కానీ ఒకే రోజు మూడు గంటలు కూర్చొని వినేసాను. చాలా బాగా నేరేషన్ ఇచ్చారు. ఆయన సినిమాలు నేను చూసాను. చాలా పెద్ద డైరెక్టర్ పూరి గారు. ఆయనతో పని చేయడానికి నేను ఎదురుచూస్తున్నాను. షూటింగ్ వచ్చే నెల జూన్ నుంచి ఉండబోతుంది. బెగ్గర్ అనే టైటిల్ మేము అనౌన్స్ చేయలేదు. అది సోషల్ మీడియాలో రూమర్ వచ్చింది అని తెలిపారు.

Also Read : Pawan Kalyan : మరోసారి ‘హరిహర వీరమల్లు’లో ఫైట్ కంపోజ్ చేసిన పవన్ కళ్యాణ్.. 50 రోజులు.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్..

దీంతో విజయ్ సేతుపతి పూరి జగన్నాధ్ సినిమా జూన్ లో షూటింగ్ మొదలవ్వబోతుందని క్లారిటీ వచ్చేసింది. పూరి ఎలాగో చాలా ఫాస్ట్ గా చేసేస్తాడు కాబట్టి 2026 మొదట్లోనే ఈ సినిమా రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇక బెగ్గర్ టైటిల్ కాదు అని చెప్పారు కాబట్టి మరి టైటిల్ ఏంటి అని చర్చ నెలకొంది. ఈ ఇద్దరి కాంబోపై భారీ అంచనాలే ఉన్నాయి.