Jaya Prakash Reddy : నాన్న చనిపోయినప్పుడు ఎవరూ రాలేదు.. ఏ హీరో ఫోన్ చేయలేదు.. ఆయన కరోనాతో చనిపోలేదు.. జయప్రకాశ్ రెడ్డి కూతురు ఎమోషనల్..

తాజాగా జయప్రకాశ్ రెడ్డి కూతురు మల్లికా రెడ్డి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా జయప్రకాశ్ రెడ్డి మరణం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

Jaya Prakash Reddy : నాన్న చనిపోయినప్పుడు ఎవరూ రాలేదు.. ఏ హీరో ఫోన్ చేయలేదు.. ఆయన కరోనాతో చనిపోలేదు.. జయప్రకాశ్ రెడ్డి కూతురు ఎమోషనల్..

Image Credits : Suman tv Youtube Channel

Updated On : May 22, 2025 / 4:33 PM IST

Jaya Prakash Reddy : టాలీవుడ్ లో దాదాపు 300లకు పైగా సినిమాల్లో విలన్ గా, కమెడియన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించిన జయప్రకాశ్ రెడ్డి 2020 కరోనా సమయంలో మరణించారు. కరోనా సమయంలో మరణించడంతో ఆయన కరోనాతోనే మరణించారని అంతా భావించారు. ఎవరూ వెళ్లకుండా సింపుల్ గానే ఆయన అంత్యక్రియలు జరిగాయి. తాజాగా ఆయన కూతురు మల్లికా రెడ్డి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా జయప్రకాశ్ రెడ్డి మరణం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

మల్లికారెడ్డి మాట్లాడుతూ.. నాన్న కరోనాతో చనిపోయారని అందరూ అనుకున్నారు. నాన్న కరోనాతో చనిపోలేదు. ఆ సమయంలో మా తమ్ముడు ఫ్యామిలీకి కరోనా వచ్చింది. దాంతో నాన్న అదే ఇంట్లో పైన పెంట్ హౌస్ లో సింగల్ గా ఉండేవారు. ఆయనకు కొన్ని హెల్త్ సమస్యలు ఉన్నాయి, మా తమ్ముడు ఫ్యామిలీకి కరోనా వచ్చి ఉన్నారు ఆ బాధ తో డిప్రెషన్ కి వెళ్లారు. ఆ రోజు ఉదయం కూడా బాగానే ఉన్నారు. అనుకోకుండా సడెన్ గా చనిపోయారు.

Also Read : Jaya Prakash Reddy : ‘జయప్రకాశ్ రెడ్డి’కి రెండు పెళ్లిళ్లు అని తెలుసా? మొదటి భార్య ఉండగానే రెండో పెళ్లి ఎందుకంటే..?

నాన్న చనిపోయినప్పుడు ఇండస్ట్రీ నుంచి ఎవరూ రాలేదు. అందరూ నాన్నకు కరోనా వచ్చి చనిపోయారు ఏమో అని రాలేదు. గుంటూరులోనే నాన్న అంత్యక్రియలు జరిగాయి. నాన్న దగ్గర 13 ఏళ్ళు మేనేజర్ గా చేసిన ఒక అంకుల్ ఒక్కరే వచ్చారు. ఆయన చనిపోయారని తెలిసి కొంతమంది సినీ పరిశ్రమ నుంచి కాల్స్ చేసారు. హీరోలు ఎవరూ కాల్స్ కూడా చేయలేదు అంటూ ఎమోషనల్ అయ్యారు.