Jaya Bachchan : జయాబచ్చన్ అమితాబ్‌ను అలా ఎప్పుడూ పిలవలేదట

గౌరవం లేని చోట ప్రేమ ఉండదు అంటున్నారు జయాబచ్చన్. రీసెంట్ గా మనవరాలు, కూతురితో కలిసి పాడ్‌కాస్ట్ లో పాల్గొన్న జయ ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు.

Jaya Bachchan

Jaya Bachchan : జయాబచ్చన్, కూతురు శ్వేతా బచ్చన్ నందాతో కలిసి ఓ పాడ్ కాస్ట్‌లో లవ్, రిలేషన్ గురించి ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు. గౌరవం లేని చోట ప్రేమ ఉండదని చెప్పారు జయ.

Shoaib Malik : హ‌నీమూన్‌లో ఎంజాయ్ చేసున్న షోయ‌బ్ మాలిక్‌..! పిక్‌ షేర్ చేసిన మూడో భార్య.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజ‌న్లు!

ప్రముఖ బాలీవుడ్ నటి జయాబచ్చన్ మనవరాలు నవ్య నవేలి నందా ‘వాట్ ద హెల్ నవ్య’ పేరుతో పాడ్‌కాస్ట్ నిర్వహిస్తున్నారు. ఈ షో రెండవ సీజన్‌లో నవ్య అమ్మమ్మ జయాబచ్చన్‌తో పాటు తల్లి శ్వేతా బచ్చన్ నందా ఈ షోలో పాల్గొన్నారు. మోడ్రన్ లవ్ గురించి, రిలేషన్స్ గురించి తల్లీ కూతుళ్లు మాట్లాడారు. అయితే జయాబచ్చన్ తనకు నచ్చని కొన్ని అంశాలపై మాట్లాడారు.

జయాబచ్చన్‌కి ఎవరైనా ‘తూ’ (నువ్వు) అని సంభోదించడం అస్సలు ఇష్టం ఉండదట. ఇదే విషయాన్ని చెబుతూ తన మనవరాలు నవ్యతో  ‘నేను ఎప్పుడైనా మీ తాతయ్యని (అమితాబ్) నువ్వు అనడం చూసావా’ అంటూ ప్రశ్నించారామె. అలా పిలిచిన తర్వాత వారి మధ్య బంధమే ఉండదని చెప్పారు.  ఎక్కడైతే గౌరవం ఉండదో అక్కడ ప్రేమ ఉండదని జయాబచ్చన్ చెప్పారు.

Ram Charan : చరణ్-ఉపాసనల కొత్త పిక్ వైరల్.. క్లీంకారతో కామెడీ పుట్టిస్తున్న అభిమానులు..

జయబచ్చన్ కూతురు శ్వేత బచ్చన్ నందా మాట్లాడుతూ ఇప్పటి ప్రేమలో సహనం లేదని.. అసలు టైమ్ కూడా తీసుకోకుండా బ్రేకప్ చెప్పుకుంటున్నారని అన్నారు. ఒకరినొకరు అర్ధం చేసుకోలేని రిలేషన్ అసలు ప్రేమే కాదన్నారామె. అందుకే త్వరపడి పెళ్లి చేసుకోకూడదని.. మెచ్యూరిటీ, సెక్యూరిటీ ఈ రెండు ఉంటేనే ప్రేమ నిలబడుతుందని శ్వేతా బచ్చన్ అన్నారు. ఈ పాడ్ కాస్ట్‌లో జయాబచ్చన్,శ్వేతాబచ్చన్ నందా, నవ్య నవేలి నందా మూడు జనరేషన్స్‌కి చెందిన ముగ్గురు  ప్రేమ, పెళ్లి, రిలేషన్ గురించి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. జయాబచ్చన్ రీసెంట్‌గా కరణ్ జోహార్ సినిమా ‘రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ’ లో కనిపించారు.ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్, అలియా భట్ కీలక పాత్రల్లో నటించారు.