Jayasudha – Jayaprada – Suhasini : అలనాటి హీరోయిన్స్.. ఒకే వేదికపై.. స్పెషల్ ఫోటో వైరల్..

తాజాగా ముగ్గురు అలనాటి హీరోయిన్స్ కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపించారు.

Jayasudha – Jayaprada – Suhasini : అలనాటి హీరోయిన్స్.. ఒకే వేదికపై.. స్పెషల్ ఫోటో వైరల్..

Jayasudha Jayaprada Suhasini in Single Frame Photo goes Viral in Telangana Gaddar Film Awards Event

Updated On : June 15, 2025 / 11:19 AM IST

Jayasudha – Jayaprada – Suhasini : మన హీరోలు, హీరోయిన్స్ కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఆ ఆనందమే వేరు. ఫ్యాన్స్ అయితే సంబరపడిపోతారు. అలాంటిది అలనాటి నటీనటులు కలిసి కనిపిస్తే ఆ పాత మధురాలు గుర్తుచేసుకోవాల్సిందే. తాజాగా ముగ్గురు అలనాటి హీరోయిన్స్ కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపించారు.

నిన్న జూన్ 14న సాయంత్రం తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల ఈవెంట్ ఘనంగా హైదరాబాద్ హైటెక్స్ లో జరగగా చాలామంది సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఈవెంట్ కి అలనాటి హీరోయిన్స్ జయసుధ, జయప్రద, సుహాసిని కూడా హాజరయ్యారు. జయసుధ తెలంగాణ గద్దర్ అవార్డుల జ్యురి కమిటీలో మెంబర్ గా ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ఈ వేడుకకు హాజరయ్యారు. డైరెక్టర్ మణిరత్నంకు తెలంగాణ ప్రభుత్వం పైడి జైరాజ్ అవార్డ్ ఇవ్వడంతో తన భర్తతో కలిసి సుహాసిని ఈ వేడుకకు హాజరయ్యారు. ఇక జయప్రద స్పెషల్ గెస్ట్ గా ఈ వేడుకకు హాజరయ్యారు.

Also See : Telangana Gaddar Film Awards : ‘తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్’.. సెలబ్రిటీల స్పెషల్ ఫొటోలు..

ఈ ముగ్గురు అలనాటి హీరోయిన్స్ ని ఒకేసారి స్టేజిపైకి పిలిచి వారిచేత పలు అవార్డులు ఇప్పించారు. దీంతో ముగ్గురు లెజెండరీ నటీమణులు స్టేజిపై ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. చాన్నాళ్ల తర్వాత ఇలా ముగ్గురు సీనియర్ హీరోయిన్స్ కలిసి కనిపించడంతో వారి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జయసుధ, సుహాసిని ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో అడపాదడపా నటిస్తున్నారు. జయప్రద మాత్రం ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు.

Jayasudha Jayaprada Suhasini

Also Read : Allu Arjun – Anchor Sravanthi : చీర బాగుంది.. అందంగా ఉన్నారు.. యాంకర్ స్రవంతితో అల్లు అర్జున్.. వీడియో వైరల్..