Maa Elections 2021: జీవిత ఓటమి.. రఘుబాబు విజయం

పోలింగ్ కేంద్రం వద్ద నరాలు తెగే ఉత్కంఠ సాగుతుంది. భారీగా క్రాస్ ఓటింగ్ జరగడంతో ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుంది అనేది పక్కాగా అర్థం కావట్లేదు.

Maa Elections 2021: జీవిత ఓటమి.. రఘుబాబు విజయం

Jeevitha

Updated On : October 10, 2021 / 9:15 PM IST

Maa Elections 2021: పోలింగ్ కేంద్రం వద్ద నరాలు తెగే ఉత్కంఠ సాగుతుంది. భారీగా క్రాస్ ఓటింగ్ జరగడంతో ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుంది అనేది పక్కాగా అర్థం కావట్లేదు. దీంతో ‘మా’ ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఈ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన జీవిత రాజశేఖర్ ఓటమి పాలయ్యారు.

ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి జనరల్ సెక్రెటరీగా పోటీ చేసిన జీవిత ఓడిపోగా.. మంచు విష్ణు ప్యానెల్ నుంచి అదే పదవికి పోటీచేసిన రఘుబాబు విజయం సాధించారు. ”మా” కమిటీ మెంబర్స్‌లో ప్రధానమైన జనరల్ సెక్రెటరీ, ట్రెజరర్ పదవులు ప్రకాష్ రాజ్ ప్యానెల్ కోల్పోయింది. ట్రెజరర్‌గా శివబాలాజీ గెలిచారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి పోటీ పడిన నాగినీడుపై శివబాలాజీ గెలిచారు. నరేష్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా శివబాలాజీ ట్రెజరర్‌గా ఉన్నారు.

మరోవైపు ప్రకాష్ రాజ్ ప్యానెల్‌లో ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌గా పోటీచేసిన శివారెడ్డి, కౌశిక్ రెడ్డి, సురేష్ కొండేటి, అనసూయ గెలుపొందారు.