Jr NTR Celebrated his Personal Trainer Kumar Mannava Birthday Celebrations Photo goes Viral
Jr NTR : ఎన్టీఆర్ ప్రస్తుతం ముంబైలో వార్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ రెగ్యులర్ గా వైరల్ అవుతున్నాడు. టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ కి రావడం, విశ్వక్, సిద్ధూతో కలిసి టిల్లు స్క్వేర్ సినిమా చూడటం, వార్ 2 షూట్ కి ముంబై వెళ్లడం.. దీంతో ఎన్టీఆర్ ఫోటోలు, వీడియోలు ఇటీవల రెగ్యులర్ గా బయటకి వస్తుండటంతో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
తాజాగా మరోసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఎన్టీఆర్ కి ఎప్పట్నుంచో కుమార్ మన్నవ అనే పర్సనల్ ట్రైనర్ ఉన్నాడు. ఎన్టీఆర్ ఇప్పుడు ఇంత పర్ఫెక్ట్ ఫిజిక్ తో ఉండటానికి అతనే కారణం. ఎన్టీఆర్ బాడీని సినిమాకి తగ్గట్టు దగ్గరుండి మారుస్తాడు. తాజాగా నిన్న కుమార్ మన్నవ పుట్టిన రోజు కావడంతో ఎన్టీఆర్ స్పెషల్ కేక్ తెప్పించి కట్ చేయించి తినిపించాడు.
Also Read : Manamey Teaser : శర్వానంద్ ‘మనమే’ టీజర్ రిలీజ్.. లండన్ లో సరికొత్త కథతో..
ఎన్టీఆర్ తన బర్త్ డే గుర్తుంచుకొని మరీ ప్రేమతో కేక్ తీసుకొచ్చి తినిపించడంతో కుమార్ ఎమోషనల్ అయ్యాడు. తన బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. నా పుట్టిన రోజు గుర్తుంచుకొని మరీ, నేను ఏం తింటానో తెలుసుకొని అలాంటి కేక్ తెప్పించి నా బర్త్ డే సెలబ్రేట్ చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. మీరు నా మనసుని హత్తుకున్నారు. మీరు నాపై, నా కుటుంబం పై చూపించే ప్రేమ, మాకు ఇచ్చే సపోర్ట్ కి నేనేమి చెప్పగలను. ఎన్టీఆర్ అంటే మానవత్వం, ప్రేమకు నిదర్శనం. మీతో ఉంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది అని పోస్ట్ చేసాడు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.
తన పర్సనల్ ట్రైనర్ బర్త్ డేని గుర్తు పెట్టుకొని మరీ సెలబ్రేట్ చేసినందుకు అభిమానులు, నెటిజన్లు ఎన్టీఆర్ ని అభినందిస్తున్నారు. ఎన్టీఆర్ ఫోటోలు మరోసారి బయటకి రావడంతో ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు.