jr ntr celebrates his wife pranathi birthday in japan
జూనియర్ ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి ప్రస్తుతం జపాన్‌లో పర్యటిస్తున్నారు. ఈ నెల 28న జపాన్ థియేటర్లలో దేవర చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు.
తన భార్య పుట్టిన రోజు వేడుకల్ని మంగళవారం రాత్రి జపాన్‌లో సెలబ్రేట్ చేశారు ఎన్టీఆర్. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభినులతో పంచుకున్నారు. ‘అమ్మలు.. హ్యాపీ బర్త్ డే’ అని ఎన్టీఆర్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కాగా.. 2011లో ఎన్టీఆర్‌తో ప్రణతికి పెళ్లైంది. వీళ్లకు ఇద్దరు కొడుకులు ఉన్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ చిత్రంలో నటించనున్నాడు. జపాన్ నుంచి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ ఈ చిత్ర షూటింగ్‌లో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది.
కొరటాల శివ దర్శకత్వంలో గతేడాది తెలుగులో విడుదలైన దేవర చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి పార్ట్-2 ఉంటుందని ఇప్పటికే దర్శకుడు వెల్లడించాడు. దివంగత శ్రీదేవి కూతురు, బాలీవుడ్ నటి జానీకపూర్ ఈ చిత్రం ద్వారానే తెలుగు తెరకు పరిచయమైంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతో మెప్పించింది.