Sukumar – Pawan Kalyan : పవన్ అలా ఓకే చెప్పగానే.. సుక్కుతో సినిమా అంటూ రూమర్స్.. ఆల్రెడీ కథ చెప్పిన సుక్కు..
పుష్ప-2తో వరల్డ్ వైడ్ హిట్ కొట్టిన డైరెక్టర్ సుకుమార్ పవన్‌తో సినిమా చేసేందుకు చాలా ఆసక్తితో ఉన్నాడట.

Director Sukumar Wants to do Movie With Pawan Kalyan
Sukumar – Pawan Kalyan : తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అంటున్నారు డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్. రాజకీయాల్లో యాక్టీవ్‌గా ఉంటూనే వీలున్నప్పడు, టైమ్ కుదిరినప్పుడు సినిమాలు చేస్తానంటున్నారు. తాజాగా పవన్ ఓ తమిళ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పవన్ మాట్లాడుతూ.. నాకు ఎలాంటి ఆదాయ మార్గాలు లేవు. నాకు వ్యాపారాలు లేవు. నాకు ఉన్నది నటన ద్వారా ఆదాయ మార్గం ఒక్కటే. నాకు డబ్బులు అవసరం ఉన్నంతకాలం సినిమాలు చేస్తాను. నేను ఒప్పుకున్న సినిమాలకు న్యాయం చేస్తాను. కానీ ప్రస్తుతం పాలనకు ఎలాంటి ఆటంకం కలగకుండా కుదిరినప్పుడు డేట్స్ ఇస్తూ సినిమాలు చేస్తాను అని అన్నారు.
దీంతో పవన్ సినిమాలు ఆపేయకుండా కంటిన్యూ చేస్తాను అని చెప్పడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే పవన్ సినిమాలు కంటిన్యూ చేయాలనుకోవడంతో ఫ్యాన్స్ పుల్ ఖుష్ అవుతుంటే, ఆయనతో సినిమాలు చేయాలనుకుంటున్న డైరెక్టర్లు స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నారట.
Also Read : Nabha Natesh : రాజ్ మహల్ లో మహారాణిలా అందాలతో మెరుస్తున్న నభా నటేష్..
పుష్ప-2తో వరల్డ్ వైడ్ హిట్ కొట్టిన డైరెక్టర్ సుకుమార్ పవన్‌తో సినిమా చేసేందుకు చాలా ఆసక్తితో ఉన్నాడట. పుష్ప-3 స్ర్కిప్ట్ వర్క్ ఎప్పుడో కంప్లీట్ చేశాడట సుక్కు. రామ్‌చరణ్‌తో చేయబోయే సినిమా స్క్రిప్ట్ కూడా రెడీగా ఉందంటున్నారు. ఇక చరణ్‌తో సినిమాకు రెడీ అయ్యేలోపు పవన్ కోసం పవర్ పుల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడట సుకుమార్.
గతంలో ఓ ఈవెంట్లో పవన్ సుకుమార్ ఆల్రెడీ పదేళ్ల క్రితమే నాకు కథ చెప్పాడు, అది కుదరలేదు. మళ్ళీ తర్వాత సినిమా చేద్దామనుకున్నాం కానీ కుదరలేదు అని చెప్పారు. దీంతో సుకుమార్ – పవన్ గతంలోనే ప్లాన్ చేసుకున్నారు కానీ అవ్వలేదు, ఒకవేళ వీళ్లిద్దరి కాంబో అయి ఉంటే సినిమా అదిరిపోయేది అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పుడు పవన్ సినిమాలు చేస్తాను అని చెప్పడంతో మిగిలిన దర్శకులు కూడా పవన్ కి కథలు రెడీ చేసే పనిలో ఉన్నారు.
Also Read : David Warner : ‘రాబిన్ హుడ్’ సినిమాకు ‘డేవిడ్ వార్నర్’ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? బాగానే ఇచ్చారుగా..
చరణ్‌తో మట్టి వాసనతో కూడిన సినిమా చేయబోతున్న సుకుమార్, పవన్‌తో కూడా ఊర మాస్, రగ్గడ్ స్టోరీ అనుకున్నాడట. అయితే పవన్, సుక్కు కాంబినేషన్‌లో సినిమా వస్తే మాత్రం బాక్సాఫీస్ బద్దలే అంటున్నారు ఫ్యాన్స్. వీళ్లిద్దరి ప్రాజెక్టు నిజమైతే భారీ అంచనాలు ఖాయం. త్వరలో పవన్ హరిహర వీరమల్లు సినిమాతో రానున్నాడు.