War 2 Twitter Review : ‘వార్ 2’ ట్విట్టర్ రివ్యూ.. ఎన్టీఆర్ కుమ్మేశాడ‌ట‌..

ఎన్టీఆర్‌, హృతిక్ రోష‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం వార్ 2 (War 2 Twitter Review). ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ మూవీ నేడు..

Jr NTR Hrithik Roshan War 2 Twitter Review

War 2 Twitter Review : ఎన్టీఆర్‌, హృతిక్ రోష‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం వార్ 2. అయాన్ ముఖర్జీ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. కియారా అద్వానీ క‌థానాయిక‌. YRF స్పై యూనివర్స్ లో బాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ఈ చిత్రాన్ని నిర్మించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ మూవీ నేడు (ఆగ‌స్టు 14 గురువారం) ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ప‌లు ప్రాంతాల్లో ఇప్ప‌టికే ఈ సినిమా ఫ‌స్ట్ షోలు ప‌డ్డాయి. ఈ మూవీని చూసిన కొంద‌రు సోష‌ల్ మీడియా వేదిక‌గా (War 2 Twitter Review) త‌మ అభిప్రాయాల‌ను తెలియ‌జేస్తున్నారు.

ఈ చిత్రంలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ల ఇద్దరి ఎంట్రీలు అదిరిపోయాయని అంటున్నారు. ఎన్టీఆర్‌, హృతిక్‌ల న‌ట‌న అదుర్స్ అని చెబుతున్నారు. ముఖ్యంగా యాక్ష‌న్ సీన్స్ నెక్ట్స్ లెవ‌ల్ అని కామెంట్లు చేస్తున్నారు. స‌లామే సాంగ్‌లో ఇద్ద‌రూ పోటాపోటీగా డ్యాన్స్ చేశార‌ని.. ప్రీత‌మ్ కంపోజ్ చేసిన ఊపిరి ఊయ‌ల‌గా సాంగ్ విజువ‌ల్ గా అట్రాక్టివ్‌గా ఉంద‌ని అంటున్నారు. అయాన్ ముఖ‌ర్జి ద‌ర్శ‌క‌త్వం బాగుందని, ఓ హాలీవుడ్ సినిమా చూసిన‌ట్లుగా ఉంద‌ని చెబుతున్నారు.

Constable Kanakam : ‘కానిస్టేబుల్ కనకం’ వెబ్ సిరీస్ రివ్యూ.. ఊళ్ళో అమ్మాయిలు మిస్సింగ్..