Jr. NTR to go to Africa for Dragon movie shoot
Ntr: దేవర తరువాత ఎన్టీఆర్ నుంచి మరో సినిమా రాలేదు. ఆయన ప్రస్తుతం కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్నాడు(Ntr). ఇంటర్నేషనల్ లెవల్లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఎన్టీఆర్ తన ఫోకస్ అంతా ఈ సినిమాపైనే పెట్టాడు. లుక్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటున్నాడు. స్పెషల్ డైట్ చేసిన చాలా సన్నగా తయారయ్యాడు. ఇక ఈ రీసెంట్ గా విడుదలైన ఎన్టీఆర్ లుక్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న న్యూస్ ఈ ప్రాజెక్టు గురించి వినిపించినా అది క్షణంలో ట్రెండ్ అవుతోంది. అంతలా ఈ సినిమాపై క్రేజ్ ఏర్పడింది.
Manchu Lakshmi: ప్రతీది భర్తకు చెప్పి చేయాలా.. అదేమైనా రూలా.. రకుల్ కి మంచు లక్ష్మి వార్నింగ్..
ఇక గ్యాంగ్ స్టర్ బ్యాక్డ్రాప్ లో రానున్న ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ చేయాలని అనుకుంటున్నారట మేకర్స్. ప్రశాంత్ నీల్ గత చిత్రాల లాగే పక్కా మాస్ అండ్ స్టైలీష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రానుంది అని టాక్. జూన్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. మేజర్ యాక్షన్ సీక్వెన్స్ తో సినిమాను మొదలుపెట్టాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమా గురించి ఇండస్ట్రీ నుంచి ఒక న్యూస్ వినిపిస్తోంది. ఇప్పటివరకు ఇండియాలోని పలు లొకేషన్స్ లో షూట్ చేసిన టీం త్వరలోనే ఆఫ్రికా వెళ్లనున్నారట.
ఎన్టీఆర్ ఫ్లాష్ బ్యాక్ కి సంబందించిన పెద్ద షెడ్యూల్ ను ఇక్కడ చిత్రీకరించబోతున్నారట టీం. ఈ సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలువనున్నాయని టాక్. ఎన్టీఆర్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్నాడు అని మరో టాక్ కూడా ఉంది. అదులో ఒకటి తండ్రి పాత్ర కావడం విశేషం. ఆ పవర్ ఫుల్ పాత్రకు సంబందించిన సీన్స్ నే ఆఫ్రికాలో సెట్ చేశాడట ప్రశాంత్ నీల్. ఈ షెడ్యూల్ తో మూవీ టీం లండన్ వెళ్లనున్నార. అక్కడ కూడా కొన్ని కీలక సీన్స్ తెరకెక్కిస్తారు. ఈ రెండు షెడ్యూల్స్ తో షూటింగ్ దాదాపు కంప్లీట్ అవుతుందని టాక్. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.