Manchu Lakshmi: ప్రతీది భర్తకు చెప్పి చేయాలా.. అదేమైనా రూలా.. రకుల్ కి మంచు లక్ష్మి వార్నింగ్..
ఇండస్ట్రీలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. హీరోలు, హీరోయిన్స్ కలిసి వెకేషన్స్ కి కూడా వెళుతూ ఉంటారు. (Manchu Lakshmi)అలా టాలీవుడ్ లో చాలా మంది క్లోజ్ ఫ్రెండ్స్ అంటే రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మి అనే చెప్పాలి.
Manchu Lakshmi warns her best friend Rakul Preet Singh
Manchu Lakshmi: ఇండస్ట్రీలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. హీరోలు, హీరోయిన్స్ కలిసి వెకేషన్స్ కి కూడా వెళుతూ ఉంటారు. (Manchu Lakshmi)అలా టాలీవుడ్ లో చాలా మంది క్లోజ్ ఫ్రెండ్స్ అంటే రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మి అనే చెప్పాలి. చాలా కాలంగా వీళ్ళ స్నేహం కొనసాగుతోంది. ఆ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ ఇద్దరే కనిపించేవారు. హాలీడేస్ కి, వెకేషన్స్ కి, వెకెండ్ గ్యాదరింగ్స్, చిన్న చిన్న పార్టీలకు కలిసి వెళ్లేవారు. కానీ, ఈ మధ్య ఈ ఇద్దరు ఇద్దరు కలిసి ఎక్కువగా కనిపించడం లేదు. కారణం రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్యే పెళ్లి జరగడం. ఈ విషయం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది మంచు లక్ష్మి.
ఇటీవల మాయ మేల్ ఫెమినిస్ట్ అనే పాడ్ కాస్ట్ లో పాల్గొంది. ఈ పాడ్ కాస్ట్ లో ఆమె చాలా విషయాల గురించి కామెంట్స్ చేసింది. ఆలాగే తన బెస్ట్ ఫ్రెండ్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి కూడా మాట్లాడింది. “ఇండస్ట్రీలో నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటే రకుల్. కానీ, ఈమధ్య మా జీవితాల్లో చాలా మార్పులు వచ్చాయి. నేను ముంబైకి షిఫ్ట్ అయ్యాను. రకుల్ జాకీ ని పెళ్లి చేసుకుంది. అయితే, పెళ్లి తర్వాత రకుల్ మారిన విధానం చూసి నేను షాక్ అయ్యాను. చిన్న విషయమైనా భర్త జాకీ కి చెప్పాలంటుంది. నేను ఏదైనా అడిగినా, ఎక్కడికైనా వెల్దామన్నా జాకీని అడిగి చెప్తాను అంటుంది. కొత్తగా పెళ్ళైన ఏ జంటలోనైనా ఇది కామన్. కానీ, నేను రకుల్ విషయం లో మరో ఏడాది వరకు ఎదురు చూస్తాను. అప్పటికీ తను మారకపోతే ఊరుకునేది లేదు. గట్టిగా దండిస్తాను. వార్నింగ్ కూడా ఇస్తాను” అంటూ చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
