Jr NTR Wishes Allu Arjun In A Funny Way
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా సోషల్ మీడియాలో మొత్తం బన్నీ హవా కనిపిస్తోంది. ఆయనకు సెలబ్రిటీల దగ్గర్నుండీ మొదలుకొని, అభిమానుల వరకు విషెస్ చెబుతూ హంగామా చేస్తున్నారు. ఇక స్టార్స్ బన్నీకి బర్త్ డే విషెస్ చెబుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. అటు బన్నీ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప-ది రూల్’ నుండి కూడా వరుస అప్డేట్స్ ఇస్తూ చిత్ర యూనిట్ మరింత హైప్ తీసుకొస్తుంది.
Allu Arjun : అల్లు అర్జున్‌కి డేవిడ్ వార్నర్ బర్త్ డే విషెస్..
అయితే, బన్నీకి ఇండస్ట్రీలో చాలా మంది సన్నిహితులు ఉన్నారు. వారిలో కొందరు మాత్రం తనకు చాలా ప్రత్యేకం అంటూ బన్నీ పలుమార్లు చెప్పుకొచ్చాడు. వారిలో తను బావా అని పిలిచే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని పలు ఈవెంట్స్‌లో చెప్పుకొచ్చాడు ఈ స్టార్ హీరో. ఇక బన్నీ బర్త్ డే సందర్భంగా లేటుగా చేసినా.. లేటెస్ట్‌గా విష్ చేశాడు తారక్. ‘నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు బావా అల్లు అర్జున్.. ఇలాంటి వేడుకలు ఘనంగా జరుపుకోవాలి’ అంటూ తారక్ ట్వీట్ చేశాడు.
Allu Arjun : అల్లు అర్జున్‌కి సెలబ్రేటిస్ బర్త్ డే విషెస్.. పుష్ప రాక్స్ అంటున్న చిరు!
దీనికి బన్నీ రిప్లై కూడా ఇచ్చాడు. ‘‘థ్యాంక్యు ఫర్ యువర్ లవ్లీ విషెస్ బావా.. వార్మ్ హగ్స్’’ అంటూ బన్నీ రిప్లై ట్వీట్ చేశాడు. ఇక ఈ రిప్లై ట్వీట్‌కు తారక్ మరోసారి ట్వీట్ చేశాడు. ‘‘కేవలం హగ్స్ మాత్రమేనా.. పార్టీ లేదా పుష్పా..’’ అంటూ సరదాగా బన్నీకి తనదైన స్టయిల్‌లో బర్త్ డే విషెస్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య సాగుతున్న చర్చను అభిమానులు ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు.
Thank you for your lovely wishes Bava … Warm Hugs .
— Allu Arjun (@alluarjun) April 8, 2023