Movies : ఈ వారం తెలుగులో థియేటర్లలో రిలీజయ్యే సినిమాలు ఇవే..

ఈ వారం తెలుగులో థియేటర్లలో రిలీజయ్యే సినిమాలు ఇవే..

Movies : ఈ వారం తెలుగులో థియేటర్లలో రిలీజయ్యే సినిమాలు ఇవే..

June second week Theatrical releasing Movies

Updated On : June 6, 2023 / 11:06 AM IST

Theatrical Releases :  సమ్మర్ లో ప్రతి సంవత్సరం పెద్ద సినిమాలు ఉంటాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం చిన్న, మీడియం సినిమాలతోనే సాగుతోంది. జూన్ రెండోవారంలో కూడా చిన్న సినిమాలే ఉన్నాయి.

సిద్ధార్థ్, దివ్యంశా కౌశిక్ జంటగా నటించిన ‘టక్కర్’ సినిమా జూన్ 9న రిలీజ్ కాబోతుంది. పూర్తి కమర్షియల్ సినిమాగా రాబోతుంది టక్కర్.

Image
సముద్రఖని, అనసూయ, ధనరాజ్, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ‘విమానం’ అనే సినిమా కూడా జూన్ 9న రిలీజ్ కానుంది. ఇందులో సముద్రఖని ఓ కుంటివాడిగా నటిస్తున్నాడు. అతని కొడుక్కి విమానం ఎక్కాలని కల. మరి అది జరుగుతుందా లేదా అనేది థియేటర్లలో చూడాల్సిందే.

Image

VJ సన్నీ, సప్తగిరి కలిసి నటించిన కామెడీ యాక్షన్ సినిమా ‘అన్‌స్టాపబుల్’. ఇటీవలే బ్రహ్మానందం చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ జరిగింది. ఈ సినిమా కుడా జూన్ 9న రిలీజ్ కానుంది. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

Image

రాహుల్ రామకృష్ణ, నవ్యస్వామి ముఖ్య పాత్రలో తెరకెక్కిన సినిమా ‘ఇంటింటి రామాయణం’. ఆహా ఓటీటీ నుంచి మొదటిసారి వస్తున్న థియేట్రికల్ సినిమా ఇది. ఇది కూడా జూన్ 9న థియేటర్స్ లోకి రానుంది.

Intinta Ramayanam Movie

 

‘పోయే ఏనుగు పోయే’ అనే ఓ చిన్న సినిమా కూడా జూన్ 9న రిలీజ్ కాబోతుంది. తెలుగు – తమిళ్ లో ఈ సినిమాను తెరకెక్కించారు.

poye yenugu poye Movie

హాలీవుడ్ ‘ట్రాన్స్‌ఫార్మర్స్ : రైజ్ ఆఫ్ ది బీస్ట్స్’ సినిమా తెలుగు డబ్బింగ్ కూడా జూన్ 9న రిలీజ్ అవ్వబోతుంది. హాలీవుడ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

Image