RRR Trailer: జస్ట్ మిస్.. చెక్కు చెదరని బాహుబలి-2 రికార్డ్!

ఇండియన్ సినిమాలో చెరగని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా బాహుబలి. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమాలలో రెండో సినిమా కంక్లూజన్ కోసం భారత ప్రేక్షకుల ఎదురుచూపులు ఎంత చెప్పుకున్నా..

Rrr Trailer

RRR Trailer: ఇండియన్ సినిమాలో చెరగని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా బాహుబలి. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమాలలో రెండో సినిమా కంక్లూజన్ కోసం భారత ప్రేక్షకుల ఎదురుచూపులు ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రభాస్, రానా, అనుష్క ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ‘బాహుబలి ద బిగినింగ్’, ‘బాహుబలి ద కంక్లూజన్’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన సంచలనం అసాధారణం. ఏకంగా తెలుగు సినిమా వేల కోట్లను కొల్లగొట్టగలదని నిరూపించిన సినిమా బాహుబలి మాత్రమే.

Prabhas: ప్రభాస్ అంటే ఓ వైబ్రేషన్.. అందుకే ఏషియా టాప్ ప్లేస్ దాసోహం!

2015లో వచ్చిన మొదటి భాగమే సెన్సేషనల్ రన్ సాధించిందనుకుంటే, 2017లో వచ్చిన రెండో భాగం ప్రభంజనమే సృష్టించింది. ‘బాహుబలి 2’ సాధించిన రికార్డులు ఏ స్థాయివంటే, ఆ తర్వాత వచ్చిన అనేక భారీ సినిమాలు ఆ రికార్డులపై ఎంతగా గురిపెట్టినా, దాని దరిదాపుల్లోకి రాలేక, చివరకు ‘నాన్-బాహుబలి’ రికార్డులతో సరిపెట్టుకోవాల్సిన స్థితి ఏర్పడింది. బాహుబలి-2 తర్వాత ఈ నాలుగేళ్లలో డజనుకు పైగా భారీ సినిమాలు వచ్చినా ఆ రికార్డులను టచ్ చేయలేకపోయాయి. చివరికి అదే దర్శకుడు రాజమౌళి సినిమా కూడా ఆ రికార్డులను టచ్ చేయలేకపోతోంది.

Balakrishna-Boyapati: ఆగని అఖండ హోరు.. డెడ్లీ కాంబినేషన్ బీబీ4 ప్లాన్స్?

ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ రచ్చే కనిపిస్తుంది. ఈ సినిమా ట్రైలర్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసారు సినీ ప్రేక్షకులు. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ముగ్గురి కెరీర్ లో కూడా ఇదే బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ సినిమా. అందుకే ఆర్ఆర్ఆర్ బాహుబలి రికార్డులను తిరగరాయడం ఖాయం అనుకున్నారు. ముందుగా ట్రైలర్ తోనే ఇది ఆరంభం అవుతుంది అనుకున్నారు. కానీ అది నిజం కాలేదు. బాహుబలి భారీ రికార్డు తృటిలో తప్పింది. 24 గంటల్లో అత్యధికంగా చూసిన సౌత్ ఇండియన్ సినిమా ట్రైలర్ గా బాహుబలి 21.8 మిలియన్ వ్యూస్ తో చెక్కు చెదరకుండా నిలబడగా 20.46 మిలియన్ వ్యూస్ తో ఆర్ఆర్ఆర్ తర్వాత స్థానంలో నిలిచింది.

Kriti Sanon: బచ్చన్ ఇంట్లోకి సనన్.. బాప్‌రే నెలకి లక్షల్లో అద్దె!

అయితే ఆర్ఆర్ఆర్ మరెన్నో కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. టాలీవుడ్ చరిత్రలో ఫాస్టెస్ట్ 10 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకున్న ట్రైలర్ గా ఆర్ఆర్ఆర్ సంచలనం సృష్టించింది. కేవలం 6 గంటల 15 నిమిషాల టైంలోనే ఆర్ఆర్ఆర్ 10 మిలియన్ వ్యూస్ అందుకోగా బాహుబలి 2 ట్రైలర్ కోసం 8 గంటల 7 నిమిషాల టైం పట్టింది. అదే ఇరవై నాలుగు గంటల్లోనే 1.2 మిలియన్ లైక్స్ దక్కించుకున్న తొలి తెలుగు ట్రైలర్ కూడా ఆర్ఆర్ఆర్ సొంతమే.