Kaala Bhairava : RRR నాటు నాటు సింగర్ కాలభైరవ స్పెషల్ సెలబ్రేషన్స్..

తాజాగా సింగర్ కాలభైరవ తన ఫ్రెండ్స్ తో కలిసి ఆస్కార్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కాలభైరవ క్లోజ్ ఫ్రెండ్స్ స్పెషల్ గా డెకరేట్ చేసి ఆస్కార్ బొమ్మ ఉన్న కేక్ ని కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ సెలబ్రేషన్స్ కి...................

Kaala Bhairava : RRR నాటు నాటు సింగర్ కాలభైరవ స్పెషల్ సెలబ్రేషన్స్..

Kaala Bhairava Oscar success celebrations with close friends

Updated On : March 20, 2023 / 8:01 AM IST

Kaala Bhairava :  RRR సినిమాలోని నాటు నాటు సాంగ్ ప్రపంచాన్ని అంతా ఊపేసి ఆస్కార్ అవార్డు సాధించిన సంగతి తెలిసిందే. సినిమా రిలీజయి సంవత్సరం అవుతున్నా నాటు నాటు అంటూ అందరూ ఊగిపోతూనే ఉన్నారు. ఇటీవలే ఆస్కార్ గెలుచుకొని RRR టీం ఇండియాకు వచ్చింది. ఇండియాలో RRR టీంకు గ్రాండ్ వెల్కమ్ లభించింది. ఇక నాటు నాటు సాంగ్ ని, ఆస్కార్ సాధించడంతో చిత్రయూనిట్ ని అందరూ ప్రశంసిస్తున్న సంగతి తెలిసిందే.

నాటు నాటు పాటని కీరవాణి సంగీత దర్శకత్వంలో రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ పాడారు. వీరిద్దరూ ఆస్కార్ స్టేజిపై కూడా నాటు నాటు పాటని పాడి అదరగొట్టేసారు. మన తెలుగు పాటను ఆస్కార్ వేదిక వరకు తీసుకెళ్లి అక్కడి వాళ్లకు లైవ్ లో పాటని వినిపించి ఆస్కార్ వేడుకలకు వచ్చిన వాళ్ళతో స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చేలా చేశారు. ఇక RRR టీం ఆస్కార్ తర్వాత అమెరికాలో ఫుల్ సెలబ్రేషన్స్ చేసుకుంది. ఇండియాకు వచ్చిన తర్వాత కూడా వరుసగా టీంలో ఎవరికి వారు వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులతో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.

Sir Movie : నెట్ ఫ్లిక్స్ లో అదరగొడుతున్న సార్.. తెలుగు, తమిళ్ రెండూ ట్రెండ్ లోనే..

తాజాగా సింగర్ కాలభైరవ తన ఫ్రెండ్స్ తో కలిసి ఆస్కార్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కాలభైరవ క్లోజ్ ఫ్రెండ్స్ స్పెషల్ గా డెకరేట్ చేసి ఆస్కార్ బొమ్మ ఉన్న కేక్ ని కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కాలభైరవ తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. తన స్నేహితులతో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాను, వీళ్ళు నా క్లోజ్ ఫ్రెండ్స్ అని, వీళ్ళ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని పోస్ట్ చేసాడు. దీంతో కాలభైరవ ఆస్కార్ సక్సెస్ సెలబ్రేషన్స్ ఫోటోలు వైరల్ గా మారాయి.

View this post on Instagram

A post shared by Kaala Bhairava (@kaalabhairava7)