Nachinavadu : నచ్చినవాడు మూవీ నుంచి ‘కదిలే కాలం ఆగిందే’ సాంగ్ రిలీజ్..

నచ్చినవాడు మూవీలో మిజో జోసెఫ్ స్వరపరిచిన 'కదిలే కాలం ఆగిందే' అనే మెలోడీ సాంగ్ రిలీజ్ అయ్యింది.

Kadhile Kaalam Aagindhe Lyrical song release from Nachinavadu movie

Nachinavadu : ఏనుగంటి ఫిల్మ్ జోన్ పతాకం పై లక్ష్మణ్ చిన్నా హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన తొలి చిత్రం “నచ్చినవాడు”. సంగీత దర్శకుడు మిజో జోసెఫ్ స్వరపరిచిన ‘కదిలే కాలం ఆగిందే’ అనే మెలోడీ ప్రేమ గీతని ప్రముఖ గాయకుడు జావేద్ అలీ పాడగా, యువ పాటల రచయిత హర్షవర్ధన్ రెడ్డి రచించారు, ఈ పాటను బి ఆర్ ఎస్ పార్టీ శేరిలింగంపల్లి ఎమ్ ఎల్ ఏ అరికెపూడి గాంధీ గారు విడుదల చేశారు. ఆయన పాట వీక్షించి సినిమా మంచి విజయం సాధించాలి అని కోరుకున్నారు.

Mahesh Babu : తలనొప్పి వస్తుండడంతో వాడడం తగ్గించాను.. మా పిల్లలు కూడా.. మహేష్ కామెంట్స్..!

అనంతరం హీరో, దర్శక నిర్మాత లక్ష్మణ్ చిన్నా మాట్లాడుతూ “నచ్చినవాడు” చిత్రం నుంచి ఈరోజు ‘కదిలే కాలం ఆగిందే’ అనే మెలోడీ పాటను బి ఆర్ ఎస్ పార్టీ శేరిలింగంపల్లి ఎమ్ ఎల్ ఏ అరికెపూడి గాంధీ గారి చేతుల మీదుగా ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేసాం. అరికెపూడి గాంధీ గారు పాట చాలా బాగుంది అని సంగీత దర్శకుడు మెజ్జో జోసెఫ్ ని కొనియాడారు. సినిమా మంచి విజయం సాధించాలి అని తన శుభాకాంక్షలు తెలియజేశారు. స్త్రీ సెల్ఫ్ రెస్పెక్ట్ కథాంశంతో నిర్మించబడిన ఈ చిత్రం యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ అందరికి నచ్చుతుంది, త్వరలోనే విడుదల చేస్తాం” అని తెలిపారు.