Kajal Aggarwal ను పెళ్లాడబోతున్న అదృష్టవంతుడు ఇతనే!..
Kajal Aggarwal Marriage: తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కలువ కళ్ల చిన్నది కాజల్ అగర్వాల్ పెళ్లిపీటలు ఎక్కనుందని గతకొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా కాజల్ నిశ్చితార్థం, పెళ్లి కి సంబంధించి ఆసక్తికర విషయాలు తెలిశాయి. కాజల్ త్వరలో బిజినెస్‌మెన్‌ని వివాహం చేసుకోనుంది. ఇటీవలే ముంబైకి చెందిన బిజినెస్మెన్ గౌతమ్ కిచ్లుతో కాజల్ నిశ్చితార్థం జరిగిందని తెలుస్తోంది.
గౌతమ్ కిచ్లు ఇంటీరియర్ డిజైనర్.. గతకొద్ది కాలంగా గౌతమ్ ఫ్యామిలీ హోం ఫర్నిషింగ్ బిజినెస్ లో ఉంది.త్వరలో కాజల్, గౌతమ్ ల పెళ్లి తేది ఖరారు చేయనున్నారని సమాచారం..
ప్రస్తుతం చిరంజీవితో ‘ఆచార్య’, కమల్ హాసన్‌తో ‘ఇండియన్ 2’, మంచు విష్ణు సోదరిగా ‘మోసగాళ్లు’ సినిమాల్లో నటిస్తుంది కాజల్.. ‘లక్ష్మీ కల్యాణం’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన కాజల్ కథానాయికగా 50కి పైగా సినిమాలు చేసింది.