Kajal Aggarwal : ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రూల్ చేసిన కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత మాత్రం అడపాదడపా సినిమాలు చేస్తుంది. అలాగే యాడ్స్, షాప్ ఓపెనింగ్స్ కూడా ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. తాజాగా కాజల్ అగర్వాల్ హైదరాబాద్ లోని ఓ జ్యువెల్లరీ షాప్ ఓపెనింగ్ లో పాల్గొంది.
హైదరాబాద్ కూకట్‌పల్లిలోని నెక్సస్ మాల్ ఎదురుగా గోకులం సిగ్నేచర్ జువెల్స్ కొత్త షోరూమ్ ప్రారంభోత్సవానికి కాజల్ అగర్వాల్ హాజరైంది. ఈ ఓపెనింగ్ కార్యక్రమం నేడు ఆదివారం జరిగింది. గోకులం సిగ్నేచర్ జువెల్స్ కొత్త షోరూమ్ ను హీరోయిన్ కాజల్ అగర్వాల్ చేతుల మీదుగా ప్రారంభించారు. దీంతో కాజల్ ని చూడటానికి భారీగా అభిమానులు, జనాలు అక్కడికి వచ్చి సందడి చేసారు.
ఈ ప్రారంభోత్సవ వేడుకలో కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. గోకులం సిగ్నేచర్ జువెల్స్ షోరూమ్‌లో సిల్వర్ జ్యువలరీ, లాబ్ గ్రోన్ డైమండ్స్, అన్ని వేడుకలకు ప్రత్యేక కలెక్షన్స్ ఉన్నాయి. డైమండ్ సెట్‌ను పెట్టుకొని చూసాను, చాలా బాగుంది అని తెలిపింది.
షోరూమ్ నిర్వాహకులు మాట్లాడుతూ.. తెనాలికి గర్వకారణమైన గోకులం సిగ్నేచర్ జువెల్స్ ఇప్పుడు హైదరాబాద్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉంది. మహిళల స్కిన్ టోన్‌కు తగ్గట్టు సిల్వర్‌లో సరికొత్త జ్యువెల్స్ మా ప్రత్యేకత. కొత్త మోడల్స్, నాణ్యతతో వెండి, వజ్ర ఆభరణాలను అందిస్తున్నామని తెలిపారు.
Also Read : Bullet Bhaskar : జబర్దస్త్ కి రాకముందు బులెట్ భాస్కర్ ఏం చేసేవాడో తెలుసా? యాంకర్ ప్రదీప్ లాగే..