Sailesh Kolanu : ఫ్యామిలీతో ఆస్ట్రేలియాకు వెళ్ళిపోతున్న శైలేష్ కొలను.. హిట్ 4 ఇప్పట్లో లేనట్టే.. మరి నెక్స్ట్ ఏంటి?
తాజాగా హిట్ 3 డైరెక్టర్ శైలేష్ కొలను మీడియాతో మాట్లాడుతూ..

Sailesh Kolanu Gives Clarity on HIT 4 Movie
Sailesh Kolanu : హిట్ సిరీస్ లో మూడు సినిమాలతో జనాల్ని బాగా ఎంటర్టైన్ చేసాడు శైలేష్ కొలను. తాజాగా నాని హీరోగా వచ్చిన హిట్ 3 సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇక హిట్ 4 సినిమాలో కార్తీ హీరో అని అనౌన్స్ చేసేసారు. దీంతో హిట్ 4 సినిమా ఎప్పుడు ఉంటుందా అని ఆలోచిస్తున్నారు. అయితే హిట్ 4 సినిమా ఇప్పట్లో ఉండేలా లేదు అని తెలుస్తుంది.
తాజాగా హిట్ 3 డైరెక్టర్ శైలేష్ కొలను మీడియాతో మాట్లాడుతూ.. నేను ఒక ఆరు నెలలు ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాను ఫ్యామిలీతో. కాస్త వెకేషన్ తీసుకొని కొత్త స్క్రిప్ట్ మీద కూర్చుంటాను. ఈసారి లవ్ రొమాంటిక్ కామెడీ స్టోరీ రాస్తున్నాను. అలాగే వెంకటేష్ గారికి ఒక సినిమా హిట్ ఇవ్వాలి. హిట్ 4 ఇప్పట్లో ఆలోచించట్లేదు. కానీ హిట్ 7 వరకు సినిమాలు ఉంటాయి అని తెలిపాడు.
Also Read : Bullet Bhaskar : జబర్దస్త్ కి రాకముందు బులెట్ భాస్కర్ ఏం చేసేవాడో తెలుసా? యాంకర్ ప్రదీప్ లాగే..
దీంతో హిట్ 4 సినిమా ఇప్పట్లో ఉండదని క్లారిటీ వచ్చేసింది. హిట్ 4 చేయాలంటే కార్తీ ఖాళీగా ఉండాలి. కార్తీ చేతిలో నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అవన్నీ అవ్వాలంటే కనీసం రెండు నుంచి మూడేళ్లు పడుతుంది. కాబట్టి ఈ లోపు శైలేష్ ఒకటి లేదా రెండు వేరే సినిమాలు చేస్తాడని తెలుస్తుంది.
శైలేష్ మంచి కామెడీ రాస్తాడని నాని చెప్పాడు. ఒక మంచి కామెడీ సినిమా రాయమని కూడా నాని శైలేష్ కి చెప్పాడంట. దీంతో శైలేష్ కొలను నెక్స్ట్ సినిమా కామెడీ లవ్ జానర్ లో ఉండబోతుందని తెలుస్తుంది. మరి నెక్స్ట్ సినిమా ఎవరితో తీస్తాడో చూడాలి.