Bullet Bhaskar : జబర్దస్త్ కి రాకముందు బులెట్ భాస్కర్ ఏం చేసేవాడో తెలుసా? యాంకర్ ప్రదీప్ లాగే..
బులెట్ భాస్కర్ కూడా తను టీవీ లోకి రాకముందు ఏం చేసేవాడో ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

Do You Know Bullet Bhaskar Work Before Jabardasth
Bullet Bhaskar : జబర్దస్త్ లో తన కామెడీ స్కిట్స్ తో పాపులారిటీ తెచ్చుకున్న బులెట్ భాస్కర్ ప్రస్తుతం జబర్దస్త్, పలు టీవీ షోలు అప్పుడపుడు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు, బయట ఈవెంట్స్ చేస్తూ బిజీగానే ఉన్నాడు. సెలబ్రిటీలు సినీ పరిశ్రమకు రాకముందు ఏదో ఒక వర్క్ చేసినవాళ్ళే. అలా బులెట్ భాస్కర్ కూడా తను టీవీ లోకి రాకముందు ఏం చేసేవాడో ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
బులెట్ భాస్కర్ మాట్లాడుతూ.. నేను మిమిక్రీ చేస్తుండేవాడిని వైజాగ్ లో. అలా కొంతమందికి తెలుసు. 2000 సంవత్సరంలో ఓ రోజు ఒక సెలూన్ షాప్ కి వెళ్తే అక్కడ ఒక అబ్బాయి నన్ను గుర్తుపట్టి మీరు మిమిక్రీ చేస్తారు కదా అని అడిగాడు. అలా ఆ అబ్బాయి నన్ను FM కి తీసుకెళ్లాడు. విశాఖ FM అని వైజాగ్ లో అప్పుడే కొత్తగా వచ్చింది. అక్కడికి ఆ అబ్బాయి తీసుకెళ్లి ఆర్జే గా అప్లై చేయించాడు. సెలెక్ట్ అయ్యాను. దాంతో కొన్నాళ్ళు ఆర్జేగా పనిచేసాను.
ఫ్యామిలీ పరిస్థితుల వల్ల పేరు, ఫేమ్ తెచ్చుకోవాలని సినీ పరిశ్రమకు వచ్చేసాను. జబర్దస్త్ లోకి ఛాన్స్ రావడంతో అప్పట్నుంచి అదే కంటిన్యూ చేస్తున్నాను అని తెలిపారు. యాంకర్ ప్రదీప్ కూడా తన కెరీర్ మొదట్లో FM లో ఆర్జేగా చేసిన సంగతి తెలిసిందే. ఆర్జే నుంచి యాంకర్ గా, నటుడిగా, హీరోగా మారాడు. చాలా మంది ఆర్జేలుగా పనిచేసినవాళ్లు సినిమా పరిశ్రమలోకి వచ్చారు.
Also Read : Sailesh Kolanu : హిట్ 3 షూటింగ్ లో నాని తలకు గాయం.. రక్తం కారినా షూటింగ్.. శైలేష్ కొలను పోస్ట్ వైరల్..