Satyabhama : రిలీజ్ డేట్ ప్రకటించిన సత్యభామ.. పోలీస్ ఆఫీసర్‌గా కాజల్ మాస్..

రిలీజ్ డేట్ ప్రకటించిన సత్యభామ. పోలీస్ ఆఫీసర్‌గా తన మాస్ చూపించడానికి రెడీ అంటున్న కాజల్.

Satyabhama : రిలీజ్ డేట్ ప్రకటించిన సత్యభామ.. పోలీస్ ఆఫీసర్‌గా కాజల్ మాస్..

Kajal Aggarwal Satyabhama Release Date Announcement video

Updated On : April 22, 2024 / 4:47 PM IST

Satyabhama : టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుసపెట్టి సినిమాలు చేస్తూ వస్తున్నారు. స్టార్ హీరోల పక్కన హీరోయిన్ గా నటిస్తూనే.. కొన్ని లేడీ ఓరియంటెడ్ మూవీస్ లు కూడా నటిస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే ‘స‌త్య‌భామ’ యాక్షన్ పోలీస్ స్టోరీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి టైటిల్ గ్లింప్స్ అండ్ టీజర్ రిలీజ్ అయ్యి సూపర్ రెస్పాన్స్ ని అందుకున్నాయి.

తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ ఓ చిన్న వీడియోని రిలీజ్ చేసారు. అది కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. కాగా ఈ మూవీని మే 17న రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేసారు. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని సుమన్ చిక్కాల డైరెక్ట్ చేస్తున్నారు. నవీన్ చంద్ర మేల్ లీడ్ లో చేస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Also read : Sruthi Chakravarthi : మిసెస్ ఇండియా రన్నరప్‌గా తెలుగు అమ్మాయి..

ఇప్పటివరకు రిలీజైన కంటెంట్ అయితే ఆడియన్స్ లో సినిమా పై మంచి బజ్ నే క్రియేట్ చేసాయి. మరి కాజల్ కెరీర్ లో 60వ మూవీగా వస్తున్న ఈ చిత్రం.. బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి. అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ అందిస్తున్నారు.