Sruthi Chakravarthi : మిసెస్ ఇండియా రన్నరప్‌గా తెలుగు అమ్మాయి..
మిసెస్ ఇండియా రన్నరప్‌గా తెలుగు అమ్మాయి. కంప్యూటర్ సైన్స్‌లో ఎంఎస్ పూర్తి చేసిన 27 ఏళ్ల శ్రుతి చక్రవర్తి..

Hyderabad women Sruthi Chakravarthi is first runner up in Mrs India
Sruthi Chakravarthi : ప్రస్తుతం తెలుగు అమ్మాయిలు అన్ని రంగాల్లో సత్తా చాటుతూ దూసుకుపోతున్నారు. ఈక్రమంలోనే హైదరాబాద్ కి చెందిన శ్రుతి చక్రవర్తి మిసెస్ ఇండియా రేసులో సత్తా చాటి ప్రశంసలు అందుకుంటున్నారు. భారత్24 సమర్పణలో ఈ నెల (ఏప్రిల్) 16వ తేదీన రాజస్థాన్‌లోని జైపూర్‌లో గ్లామానంద్ గ్రూప్.. మిసెస్ ఇండియా-2024 అందాల పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు.
ఇక ఈ పోటీలో శ్రుతి చక్రవర్తి కూడా పాల్గొన్నారు. ఆ అందాల పోటీలో మొత్తం 20 మంది కంటెస్టెంట్స్ తో పోటీపడిన శ్రుతి చక్రవర్తి.. మొదటి రన్నరప్‌గా నిలిచారు. ఫస్ట్ రన్నరప్‌గా టైటిల్ ని అందుకున్న శ్రుతి చక్రవర్తి.. రీసెంట్ గా హైదరాబాద్ కి చేరుకున్నారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఆమెకు.. కుటుంబసభ్యులు, స్నేహితులు ఘన స్వాగతం పలికారు.
Also read : Tillu Cube : ‘టిల్లు క్యూబ్’ కోసం ఆ హిట్ దర్శకుడు.. ఈసారి కామెడీ డోస్ మరికొంచెం..
View this post on Instagram
27 ఏళ్ల శ్రుతి చక్రవర్తి కంప్యూటర్ సైన్స్‌లో ఎంఎస్ పూర్తి చేసి హైదారాబాద్ లోనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా ఉద్యోగం చేస్తున్నారు. అయితే ముందుకు మోడలింగ్ రంగం పై ఆసక్తి ఉండడంతో అటు వైపు కూడా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. అలాగే ఒక గృహిణిగా కూడా తన భాద్యతలు నిర్వర్తిస్తూ వస్తున్నారు. ఉద్యోగం, ప్యాషన్, కుటుంబ భాద్యతలు నిర్వర్తిస్తూ ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
View this post on Instagram
View this post on Instagram