Tillu Cube : ‘టిల్లు క్యూబ్’ కోసం ఆ హిట్ దర్శకుడు.. ఈసారి కామెడీ డోస్ మరికొంచెం..

'టిల్లు క్యూబ్' కోసం ఆ హిట్ దర్శకుడుని తీసుకు వస్తున్న సిద్ధూ జొన్నలగడ్డ. ఈసారి కామెడీ డోస్ మరికొంచెం..

Tillu Cube : ‘టిల్లు క్యూబ్’ కోసం ఆ హిట్ దర్శకుడు.. ఈసారి కామెడీ డోస్ మరికొంచెం..

Siddu Jonnalagadda bring mad director Kalyan Shankar for Tillu Cube

Tillu Cube : సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా ఆడియన్స్ ముందుకు వచ్చి ఆకట్టుకున్న క్రైమ్ కామెడీ ఫ్రాంచైజ్ ‘డీజే టిల్లు’. ఈ ఫ్రాంచైజ్ లో మొదటి మూవీ ‘డీజే టిల్లు’ 2022లో ఒక చిన్న సినిమా రిలీజయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. కేవలం హిట్ మాత్రమే కాదు, సినిమాలోని హీరో పాత్రకి భారీ క్రేజ్ ఏర్పడింది. దీంతో ఆ పాత్రతో మరిన్ని సినిమాలు తీసుకు రావాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు.

ఈక్రమంలోనే డీజే టిల్లుకి కొనసాగింపుగా సెకండ్ మూవీగా ‘టిల్లు స్క్వేర్’ ని తీసుకు వచ్చారు. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి మూవీని మించి విజయాన్ని అందుకుంది. సిద్ధూకి మొదటి వంద కోట్ల మూవీగా నిలిచింది. ఈ సెకండ్ మూవీ మొదటిదాన్ని మించి అవ్వడంతో.. మేకర్స్ ఇప్పుడు మూడు సినిమాని కూడా వెంటనే తీసుకు వచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టేసారు. ఆల్రెడీ ‘టిల్లు క్యూబ్’ అని టైటిల్ ని కూడా అనౌన్స్ చేసారు.

Also read : Kalki 2898AD : ‘అశ్వత్థామ’గా అమితాబ్.. మరి ‘కల్కి’లో మిగిలిన ఆరుగురు చిరంజీవులు ఎవరు?

ఇక ఈ సినిమాని డైరెక్ట్ చేయడం కోసం ఓ హిట్ దర్శకుడిని రంగంలోకి దించుతున్నారు. ‘మ్యాడ్’ వంటి కామెడీ బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించిన కళ్యాణ్ శంకర్ ని టిల్లు క్యూబ్ కోసం తీసుకు వస్తున్నారు. సిద్ధూ కామెడీ టైమింగ్ కి కళ్యాణ్ శంకర్ కామెడీ రైటింగ్ తోడైతే థియేటర్లు కామెడీ కార్నివాల్ అవ్వడం ఖాయం. ఇక ఈ వార్త తెలియడంతో ఆడియన్స్.. ఇది అసలైన మ్యాడ్ కాంబినేషన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా కళ్యాణ్ శంకర్ ప్రస్తుతం మ్యాడ్ స్క్వేర్ తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఇటీవలే ఈ మూవీని లాంచ్ చేసిన కళ్యాణ్.. ఆ సినిమా షూటింగ్ పూర్తి అయిన తరువాతే టిల్లు క్యూబ్ స్టార్ట్ చేయనున్నారని తెలుస్తుంది. మరి ఈ మ్యాడ్ కాంబినేషన్ ఎలా ఉండబోతుందో చూడాలి. కాగా డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలకు సిద్ధూనే కథ, మాటలు రాసుకొచ్చారు. ఇప్పుడు మూడో సినిమాకి కూడా ఆయనే రాయబోతున్నారు.